బాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతోన్న హీరోల్లో వరుణ్ ధావన్ ఒకరు. రీసెంట్ గా జూడ్వా 2 సినిమాతో ఈ యువ హీరో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. ఆ సినిమా దాదాపు 200 కోట్ల రూపాయలను క్రాస్ చేసింది. అంతే కాకుండా వరుణ్ ధావన్ కి యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ పెరిగింది. మొన్నటి వరకు ఓ మీడియం హీరోగా ఉన్న వరుణ్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. దీంతో ఎక్కడికెళ్లినా అభిమానులు ఎగబడుతున్నారు.
అయితే అభిమానులను ఆప్యాయంగా దగ్గరికి వస్తే ఈ యువ హీరో అస్సలు కాదనలేక వారిని కలుస్తున్నాడు. అంతే కాకుండా వారి కోరిక మేరకు సెల్ఫీలు కూడా దిగుతున్నాడు. రీసెంట్ గా ఇదే తరహాలో ఒక అభిమానికి నడి రోడ్డుమీదే ఇచ్చిన సెల్ఫీ అతనికి చిక్కులు తెచ్చిపెట్టింది. అసలేం జరిగందంటే.. ముంబైలోని ఓ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే అందులో వరుణ్ ధావన్ కూడా చిక్కుకున్నాడు. అతని కారుపక్కనే ఉన్న ఒక ఆటోలోని అమ్మాయి వరుణ్ ని చూసి సెల్ఫీ అడగడంతో కారులోంచే మనోడు సెల్ఫీ ఇచ్చాడు.
దీంతో ఆ సెల్ఫీ ముంబై పోలీసుల వరకు చేరడంతో వారు ట్విట్టర్ ద్వారా అతనికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చి ఫైన్ వేశారు. సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా ఉండాలి.. ఇలా సెల్ఫీ ఇవ్వడం కారణంగా నీతోపాటు ఇతరుల జీవితాన్ని కూడా నువ్వు ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది అంటూ ముంబయ్ పోలీసులు ట్వీట్టర్ ద్వారా సందేశం ఇచ్చారు. దీంతో వరుణ్ ధావన్ కూడా వివాదాన్ని ఏమాత్రం ఎక్కువగా చేయకుండా వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించాడు. అభిమాని కోరికను కాదనలేక అలా సెల్ఫీ ఇచ్చాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయనని బదులిచ్చాడు. దీంతో వివాదం అంతటితో ఎండ్ అయినట్లయ్యింది.