క్రియేటివిటీని కాపీ కొడుతున్నారంటూ దర్శకరచయితలు తారలపై పలు కేసులు కోర్టుల పరిధిలో పెండింగుల్లో ఉన్న సంగతి తెలిసిందే. కాపీరైట్స్ ఉల్లంఘన విషయంలో కఠిన నియమాలు ఇటీవల అమల్లోకొచ్చాయి. తాజాగా ప్రముఖ హాస్యనటుడు వీర్ దాస్ తన కొత్త షో విషయంలో ఈ తరహా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. కాపీరైట్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ముంబై పోలీసులు అతనితో పాటు నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు సహా మరో ఇద్దరిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. పాపులర్ హిందీ నిర్మాత ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇటీవల వీర్ దాస్ కొత్త షో ప్రోమో ప్రసారం అవ్వడంతో ఇది కాపీ షో అంటూ నిర్మాత ఫిర్యాదు చేశారు.
ప్రముఖ థియేటర్ నిర్మాత అశ్విన్ గిద్వానీ వీర్ దాస్ పై ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. అక్టోబర్ 2010లో తన కంపెనీ ఒక షోను నిర్మించడానికి వీర్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. కానీ ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్యా సఖ్యత చెడి దూరమయ్యారు.
ఇంతకీ గొడవేమిటి...?
మీడియా కథనాల ప్రకారం.. గిద్వానీ నెట్ ఫ్లిక్స్ లో వీర్ దాస్ కొత్త షో ప్రోమోను చూసినప్పుడు కొంత కంటెంట్ మునుపటి ప్రదర్శన (2010) నుండి కొన్ని మార్పులతో కాపీ చేసారని అతను గ్రహించాడని ముంబై-కఫ్ పరేడ్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. కాపీరైట్ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం దాస్ మరో ఇద్దరు వ్యక్తులు .. నెట్ ఫ్లిక్స్ సర్వీస్ పై నవంబర్ 4న కేసు నమోదు అయింది. ఎవరినీ అరెస్టు చేయలేదు.. కానీ విచారణ జరుగుతోంది.
పాత వివాదం:
వీర్ దాస్ ఇబ్బందుల్లో పడటం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా అతనిపై ఒక వీడియో విషయంలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. హాస్యనటుడు వీర్ యునైటెడ్ స్టేట్స్ లో ఒక కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చాడు. అందులో భారతదేశం గురించి అతని మోనోలాగ్ శీర్షిక వివాదాస్పదమైంది. ``నేను రెండు భారతదేశాల నుండి వచ్చాను`` అనే శీర్షికతో సోషల్ మీడియాలో ఆ షో వైరల్ అయ్యింది. అటుపై ఇది వివాదానికి దారితీసింది.
అతడు విడుదల చేసిన ప్రోమోలో ``ఈ వీడియో వేర్వేరు పనులను చేసే రెండు వేర్వేరు భారతదేశాల ద్వంద్వత్వం``పై వ్యంగ్యంగా కనిపిస్తుంది. ఏ దేశంలో నైనా చీకటి- వెలుతురు.. మంచి - చెడు రెండూ ఉంటాయి. ఇదేమీ రహస్యం కాదు. మనం గొప్పవాళ్లమని ఎప్పటికీ మర్చిపోవద్దని వీడియో ప్రేరేపిస్తుంది. మనల్ని గొప్పగా మలిచేవాటిపై దృష్టి పెట్టడం ఎప్పటికీ ఆపకూడదు.
ఇది మనమందరం ప్రేమించే విశ్వసించే గర్వించే దేశానికి చప్పట్లు కొట్టేలా ఒక భారీ దేశభక్తి అంకంతో ప్రోమో ముగుస్తుంది. ``మన దేశంలో మీడియా హెడ్ లైన్స్ కంటే చాలా ఎక్కువ తెలుసుకోవాల్సింది ఉంది.. ఇక్కడ డెప్త్ తో అందం ఉంది`` అంటూ అదే వీడియోలోని పాయింట్ వీక్షకులు చప్పట్లు కొట్టడానికి కారణమైంది. అంటే భారతదేశంలోని మంచి - చెడు రెండు కోణాలను వీర్ దాస్ ఈ కార్యక్రమం ద్వారా చూపదలిచారు. ఇప్పుడు తన మునుపటి షోకి కాపీ చేశాడంటూ నిర్మాత గిద్వానీ అతడిపై ఫిర్యాదు చేసారు. మునుముందు విచారణలో వాస్తవాలు తేలాల్సి ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.