పాపం మురళి శర్మతో ఆ స్టెప్ వేయించారుగా..!

Update: 2023-01-11 16:30 GMT
యువ హీరో కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ఈ సినిమాను మురళి కిశోర్ డైరెక్ట్ చేశారు. కిరణ్ సరసన కశ్మీరా పరదేశి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ కాగా తిరుపతి నేపథ్యంతో కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్ని అంశాలతో కలిసి సినిమా వస్తుందని అనిపిస్తుంది. ఇక ఈ మూవీ లో ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ మురళి శర్మ కూడా నటించారు.

సినిమాలో ఆయన పాత్ర హైలెట్ అయ్యేలా ఉంది. మూవీలో మురళి శర్మ హీరోయిన్ కు లైన్ వేస్తూ ఫన్నీగా కనిపించారు. ఆ ఏజ్ లో ఆయన ఆమెను లవ్ లో పడేయాలని సాహసాలు చేస్తుంటారు. అందులో ఒకటి టీజర్ లో చూపించిన అల వైకుంఠపురం లో నీ కాళ్లను పట్టుకు వదలనన్నది సాంగ్ బన్నీ ఐకానిక్ స్టెప్ ను నేల మీద పడుకుని మరీ చేశారు మురళీ శర్మ. ఓ విధంగా సినిమాలో హీరో పాత్రకు ఈక్వల్ గా ఆయన క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా ఉందని ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

మురళి శర్మ కూడా కెరీర్ లో ఫస్ట్ టైం ఇలా డిఫరెంట్ రోల్ లో నటించారు. హీరోయిన్ కోసం ఆయన చేసే ప్రయత్నాలు అన్ని సినిమాకు బాగా హెల్ప్ అయ్యేలా ఉంటాయని చెప్పొచ్చు.

మురళి శర్మతో అల్లు అర్జున్ స్టెప్ వేయించినప్పుడే సినిమాలో ఆయన్ను బాగా వాడేసినట్టు అర్థమైంది.

అల వైకుంఠపురములో సినిమాలో మురళి శర్మ కూడా నటించారు. కానీ ఆ సినిమాలో పాటకి ఈయన స్టెప్ వేయడం మాత్రం కొత్తగా ఉంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు మురళి శర్మ. సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు రెడీ అంటున్నారు ఆయన. వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలో మురళి శర్మ పాత్ర మాత్రం ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ అందిస్తుందని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. మరి కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో హిట్ కొట్టేస్తారా లేదా అన్నది ఫిబ్రవరి 17న తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    

Similar News