సల్మాన్ ఖాన్ పై మర్డర్ ప్లాన్.. మళ్ళీ అలెర్ట్!

Update: 2022-09-12 03:43 GMT
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి హై అలెర్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇదివరకే అతను కొన్నిసార్లు కొన్ని బెదిరింపు కాల్స్ తో పాటు లేఖలు కూడా అందుకోవాల్సి వచ్చింది. గతంలో కాస్త దూకుడుగా కనిపించిన సల్మాన్ ఖాన్ జింకను వేటాడిన కేసులో అలాగే ర్యాష్ డ్రైవింగ్ కేసులో కాస్త సతమతమైన తరువాత మళ్ళీ పెద్దగా వివాదాలకు తావివ్వకుండా చాలా సింపుల్ గానే గడిపేందుకు ఇష్టపడుతున్నాడు.

వీలైనంతవరకు వివాదాల జోలికి వెళ్లకుండా తన పని తాను చూసుకుంటూ అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అంతే కాకుండా సినిమాలలో కూడా సెన్సిటివ్ కాంట్రవర్సీ అంశాలు ఏమాత్రం లేకుండా చూసుకుంటున్నాడు. అయినప్పటికీ ఆ వివాదాలు అతన్ని వదలడం లేదు. అయితే ఈ క్రమంలో అతనికి గత ఏడాది నుంచి కొంతమంది గ్యాంగ్ స్టర్స్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

ముంబైలోని ప్రముఖ గ్యాంగ్ స్టార్ గా పేరుపొందిన లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ తండ్రికి ఒక లేఖ కూడా అందిన విషయం తెలిసిందే. మీ కుటుంబ సభ్యులను హత మారుస్తాము అంటూ అందులో పేర్కొనడంతో వెంటనే సల్మాన్ ఖాన్ పోలీస్ లను కూడా ఆశ్రయించాడు. అనంతరం తన రక్షణ కోసం ప్రత్యేకంగా లైసెన్స్ డ్ రివాల్వర్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. అయితే బిష్ణోయ్ ప్లాన్ తోనే మరోసారి సల్మాన్ ఖాన్ పై రెక్కి నిర్వహించినట్లు కూడా తెలుస్తోంది.

ఇటీవల పంజాబ్లోని ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలాను హతమార్చిన వారితోనే సల్మాన్ ఖాన్ పై రెక్కీ నిర్వహించినట్లు ముంబై పోలీసులు తెలియజేశారు. దీంతో సల్మాన్ ఖాన్ మళ్లీ అలెర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదివరకే సల్మాన్ ఖాన్ అవసరం లేనిదే బయటకు కదలడం లేదు. అలాగే తన సమాచారం కూడా చాలా గోప్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

ఏదైనా అత్యవసర సమయాల్లో బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు మాత్రం ముందస్తుగా లోకల్ పోలీసులకు  తప్పనిసరిగా తెలియజేయాల్సి వస్తోంది. సల్మాన్ ఖాన్ షూటింగ్ సమయంలో కూడా పోలీసు బందోబస్తుతోనే తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి రెక్కీ నిర్వహించినట్లు తెలియడంతో అతను మరింత అలెర్ట్ అయ్యాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News