కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ ఏడాది ఆరంభంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి దర్బార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంటనే సమ్మర్ లో మరో సూపర్ స్టార్ విజయ్ తో సినిమాను చేసేందుకు మురుగదాస్ ప్లాన్ చేశాడు. విజయ్ మాస్టర్ సినిమా విడుదలకు ముందే మురుగదాస్ సినిమాను పట్టాలెక్కించానుకున్నాడు. కాని కరోనా కారణంగా మాస్టర్ సినిమా విడుదల కాలేదు అలాగే విజయ్ మురుగదాస్ ల మూవీ పట్టాలెక్కలేదు. వీరిద్దరి కాంబోకు మంచి క్రేజ్ ఉంది.
2018లో వీరిద్దరి కాంబోలో వచ్చిన ాసర్కార్‌్ణ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా రాజకీయంగా కూడా దుమారం రేపడం జరిగింది. ఇప్పుడు మరోసారి రాజకీయ నేపథ్యంలోనే సినిమాను చేసేందుకు వీళ్లు రెడీ అయ్యాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి షూటింగ్ కు రెడీగా ఉన్న మురుగదాస్ ఎప్పుడెప్పుడు విజయ్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నాడట. ప్రస్తుతం కరోనా కారణంగా అది కూడా తమిళనాడులో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా విజయ్ షూటింగ్స్ కు బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదట. అంతా ఓకే అయితే అక్టోబర్ లో మొదలు పెట్టేద్దాం అంటూ మురుగదాస్ కు విజయ్ హామీ ఇచ్చాడంటూ కోలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీరిద్దరి కాంబో వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రముఖ సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్దం అయ్యింది. త్వరలో పూర్తి వివరాలు వెళ్లడి చేసే అవకాశముంది.