ఆర్.ఆర్.ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించిన ఎన్టీఆర్ ఆ తర్వాత తన కెరీర్ 30వ సినిమాలో నటించాల్సి ఉన్నా అంతకంతకు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. మారిన ఇమేజ్ తో ఇప్పుడు కొరటాల అండ్ టీమ్ పాన్ ఇండియా కథాంశంపై వర్కవుట్ చేయడమే ఈ ఆలస్యానికి కారణమని కూడా గుసగుసలు వినిపించాయి.
NTR30 ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా చిత్రీకరణకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి రానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కొందరు భాగస్వాములు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో బడ్జెట్ల పరంగా సమస్యలేవీ లేవు.
ఇక ముహూర్తానికి సమయం ఆసన్నమవుతున్న క్రమంలో యువసంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు పూర్తిగా ఎన్టీఆర్ 30 పై దృష్టి పెట్టాడని తెలిసింది. దర్శకుడు కొరటాల శివతో అతడు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించాడు. చిత్రీకరణను ప్రారంభించే ముందు కంపోజిషన్ లలో కొంత భాగాన్ని పూర్తి చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి చివరి నిమిషంలో తొందరపడాల్సిన అవసరం లేదు. ఆడియో ఆల్బమ్‌కు అనిరుధ్ ఏదైనా ట్యూన్ ని ఖరారు చేశారా అనేది తెలియాల్సి ఉంది.
రెమహాన్ లేని లోటు అలానే!
ఏ.ఆర్.రెహమాన్- హ్యారిష్ జైరాజ్- యువన్ శంకర్ రాజా లాంటి టాప్ క్లాస్ సంగీత దర్శకులు ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలకు అందుబాటులో లేరు. వీరంతా తమిళ ఇండస్ట్రీ లో లేదా విదేశీ కచేరీలతోనే బిజీగా ఉంటున్నారు కానీ టాలీవుడ్ పై పెద్దగా ఫోకస్ చేయలేదు. క్రియేటివ్ బీజీఎంలతో అద్భుతమైన స్వరాలను సమకూర్చడంలో వీరంతా స్పెషలిస్టులుగా గుర్తింపు పొందారు. అయితే ఆ లోటును తీర్చేందుకు నేటితరంలో అనిరుధ్ రవిచంద్రన్ అందుబాటులో ఉన్నాడు. అతడు ఇప్పటికే సక్సెస్ పైరంగా స్పీడ్ మీదున్నాడు. ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ కంపోజర్లలో అనిరుధ్ ఒకరిగా కొనసాగుతున్నారు. అతను బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నాడు. ఇక ఇదే స్పీడ్ లో ఇప్పుడు తారక్ - కొరటాల మూవీ కోసం పని చేస్తున్నాడు.
సినిమా లాంచ్ సందర్భంగా విడుదల చేసిన ఒక చిన్న ప్రోమోలో బీజీఎం క్యూరియాసిటీని పెంచింది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం BGM నెవ్వర్ బిఫోర్ అనేలా యూనిక్ గా ఉండాలని తారక్ అనిరుధ్ ముందు సవాల్ విసిరారట. దీంతో అతడు ఈ సవాల్ ని స్వీకరించి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. తారక్ కోసం ఒకటికి పది వెర్షన్లను అతడు వినిపించనున్నాడని టాక్ ఉంది.
ఎన్టీఆర్ కి కథ అందించేందుకు కొరటాల కూడా ఇలానే సవాళ్లను ఎదుర్కొన్నాడు. అతడు స్క్రిప్టును రెడీ చేసేందుకే చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ విడుదల తర్వాత తారక్ కి ఇమేజ్ పెరిగింది. పాన్ ఇండియా హీరోగా అతడు ఎదిగాడు. అందుకు తగ్గట్టే పాన్ ఇండియా కథాంశాన్ని కొరటాల ఎంచుకున్నారని గుసగుస వినిపిస్తోంది. అనిరుధ్ లాంటి యంగ్ ట్యాలెంట్ యాడవ్వడంతో టీమ్ లో జోష్ నిండింది. ఇందులో తారక్ పాత్ర కూడా చాలా రఫ్ గా భారీ యాక్షన్ తో ఉంటుందని ఇంతకుముందు విడుదలైన లుక్ వెల్లడించింది. మోషన్ పోస్టర్ క్యూరియాసిటీని పెంచింది. దానికి తగ్గట్టే బీజీఎంని మ్యూజిక్ ని అనిరుధ్ సిద్ధం చేస్తున్నారు. ట్యూన్లను పలు వెర్షన్లు విని తారక్- కొరటాల ఫైనల్ చేయనున్నారని సమాచారం.