గతంలో తమిళ సంగీత దర్శకులు తెలుగు సినిమాలకు రెగ్యులర్ గా పని చేసే వాళ్లు కానీ.. మధ్యలో కొంచెం స్పీడు తగ్గింది. యువన్ శంకర్ రాజా - హారిస్ జైరాజ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. వారి తర్వాత వచ్చిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు తమిళ సినిమాలతోనే ఫుల్ బిజీగా ఉన్నారు. ఐతే ఈ మధ్య ఒకరిద్దరు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఇటు వైపు చూస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా ‘అ..ఆ’కు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా.. రామ్ చరణ్ సినిమాతో మరో యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులోకి వస్తున్నాడు. అతనే హిప్ హాప్ తమిళ. పేరు చాలా చిత్రంగా ఉంది కదా.. అలాగే అతడి సంగీతంలోనూ వైవిధ్యం ఉంటుంది.
విశాల్ పరిచయం చేసిన ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గత ఏడాది మూడు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు. అందులో ‘తనీ ఒరువన్’ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ హీరోగా తెలుగులోకి రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంగీత దర్శకుడిగా ఎవరిని పెట్టుకుందాం అని తెలుగులో కొంతమంది పేర్లు పరిశీలించి, చివరికి తమిళ వెర్షన్ కు పని చేసిన హిప్ హాప్ తమిళనే ఫిక్స్ చేశారట చరణ్ - సురేందర్ రెడ్డి. తమిళ మ్యూజిక్ అందించిన లేటెస్ట్ మూవీ ‘కథకళి’ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అందులో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా హైలైట్ అయింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన హిప్ హాప్ తమిళ.. రామ్ చరణ్ సినిమాకు సంగీతం అందిస్తున్న మాట వాస్తవమే అని.. ఇంకో రెండు నెలల్లో సినిమా మొదలవుతుందని అప్ డేట్ ఇచ్చాడు.