సినిమా డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ మధ్య అండర్ స్టాండింగ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. సినిమా సక్సెస్ లో సగ భాగం మ్యూజిక్ కీ రోల్ పోషిస్తుందన్నది మేకర్స్ మాట. అందుకే ఏ సంగీత దర్శకుడై నా సరే సినిమా కనీసం సగం పూర్తయ్యే వరకైనా! దర్శకుడితో కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నది చాలా మంది మాట. అయితే ఇది ఆయా దర్శకులు-మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య ఉన్న ర్యాపో మీద అధారపడి ఉంటుంది.
సినిమా ప్రారంభానికి ముందే ఇద్దరి మధ్య బోలెడన్ని సింట్టింగ్ లు జరుగుతుంటాయి. అవసరమైన చోట దర్శకులు మార్పులు చెప్పడం..వాటిని ఛేంజ్ చేసి మళ్లీ వినిపించడం వంటివి ఏ సంగీత దర్శకుడైనా విధిగా చేయాల్సిందే.
ఇక మ్యూజిక్ సిట్టింగ్స్ అనేవి రకరకాల ప్రదేశాల్లో జరుగుతుంటాయి. దేశ-విదేశాల్లో చిలౌట్ అవుతూ మరి సిట్టింగ్స్ నిర్వహిస్తుంటారు. మరి మిక్కీజే మేయర్ తో జర్నీ అంటే ఎలా ఉంటుందో ఆయన మాట్లోలనే తెలుసుకుందాం.
ఎన్నో మెలోడీస్ తో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న మిక్కీ ఎలాంటి బాణీలు సమకూర్చారో చెప్పాల్సిన పనిలేదు. త్వరలో 'అన్నీ మంచి శకనుములే' సినిమా పాటలతో మెప్పించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయనతో వర్క్ అనుభవం ఎలా ఉంటుందో చూద్దాం.మీరు ఎక్కువగా విదేశాల్లో ఉండే పనిచేస్తుంటారు? ఇక్కడ నుంచి పనిచేస్తే ఆ ప్రభావం వేరుగా ఉంటుదేమో! అంటే ఆసక్తి కర సమాధానం ఇచ్చారు.
'లక్కీగా వాళ్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. 'హ్యాపీడేస్' నుంచి నా పని తీరు ఇదే శైలిలో కొనసాగుతుంది.నేను పనిచేసే సినిమాలకి మ్యూజిక్ సిట్టింగ్స్ అని..సమావేశాలని ఏమీ ఉండవు. దర్శకులు చెప్పిన కథ విని రంగంలోకి దిగిపోతా.
నా మ్యూజిషన్లపైనా వెస్ట్రన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాళ్లంతా లండన్..అమెరికాలో ఉంటారు. వాళ్ల పనితీరు నా శైలికి చాలా దగ్గరగా ఉంటుంది. విదేశాల్లో ఉంటేనే పని సులభం అవుతుంది. నేను మరోచోట..వాళ్లు ఒక చోటు ఉంటే పని ఆసల్యం అవుతుంది. ఔట్ ఫుట్ నేను అనుకున్న విధంగా రాదు' అని అన్నారు.