KGF కంపోజర్.. డబుల్ స్ట్రోక్

తరువాత కన్నడ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ‘కేజీఎఫ్’ సిరీస్ తో ఇండియా వైడ్ గా అతని పేరు వినిపించింది.

Update: 2024-11-07 05:35 GMT

‘కేజీఎఫ్’ సిరీస్ తో అందరి దృష్టిని ఆకర్షించిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్‌. ఈ సిరీస్ తో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా రవి బస్రూర్‌ మంచి క్రేజ్ అందుకున్నాడు. ‘ఉగ్రం’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయిన అతను మొదట్లోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. తరువాత కన్నడ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ‘కేజీఎఫ్’ సిరీస్ తో ఇండియా వైడ్ గా అతని పేరు వినిపించింది.

తెలుగులో రవి బస్రూర్ శ్రీకాంత్ ‘మార్షల్’ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. టాలీవుడ్ లో అతనికిదే ఫస్ట్ మూవీ. తరువాత ‘శాసనసభ’ అనే సినిమాకి సంగీతం అందించారు. వీటి తర్వాత ప్రశాంత్ నీల్ ‘సలార్’ కి మరల మ్యూజిక్ అందించాడు. అయితే దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. సల్మాన్ ఖాన్ ‘అంతిమ్’ సినిమాతో రవి బస్రూర్ హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తరువాత కార్తీ ‘ఖైదీ’ కి రీమేక్ గా తెరకెక్కిన ‘భోళా’ కి వర్క్ చేశాడు.

ఈ ఏడాది రవి బస్రూర్ నుంచి తెలుగులో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘భీమా’ వచ్చింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. తరువాత కన్నడంలో ధృవ్ సర్జా హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ‘మార్టిన్’ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి రవి బస్రూర్ అందించిన మ్యూజిక్ చాలా లౌడ్ గా ఉందనే విమర్శలు వచ్చాయి. ఆ సౌండ్ కి తలనొప్పి వచ్చిందనే కామెంట్స్ కూడా వినిపించాయి. అంత హెవీగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.

రీసెంట్ గా రోహిత్ శెట్టి ‘సింగం అగైన్’ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ సినిమా మ్యూజిక్ పరంగా పర్వాలేదనే టాక్ తెచ్చుకున్న సినిమాకి చెప్పుకోదగ్గ ఆదరణ రావడం లేదు. అజయ్ దేవగన్ సింగం క్యారెక్టర్ ఎలివేషన్ మ్యూజిక్ మాత్రం బాగోలేదని ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన. ఈ ఏడాది రవి బస్రూర్ నుంచి వచ్చిన మూడు సినిమాలు కమర్షియల్ ఫెయిల్యూర్ గానే నిలిచాయి.

కేవలం 20 రోజుల గ్యాప్ లోనే వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడం గమనార్హం. ఈ సినిమాల మ్యూజిక్ పరంగా కూడా రవి బస్రూర్ ప్రేక్షకులని ఏ మాత్రం ఆకట్టుకోలేదని చెప్పాలి. నెక్స్ట్ రబి బస్రూర్ నుంచి మలయాళంలో ‘మార్కో’ అనే మూవీ రాబోతోంది. మరి ఈ సినిమా అతనికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News