బికినీ కంటే ఘాటుగా కంగువా బ్యూటీ మాయ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ దిశా పటాని.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ దిశా పటాని. ఈ అమ్మడు నటిగా తెలుగు సినిమా ‘లోఫర్ తో కెరియర్ స్టార్ట్ చేసింది. ఆ మూవీ డిజాస్టర్ అయిన తరు వాత హిందీలోకి ఎంఎస్ ధోని బయోపిక్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంది. కెరియర్ ఆరంభంలోనే జాకీచాన్ ‘కుంగ్ ఫూ యోగా’ సినిమాలో నటించింది.
దిశా పటాని ఈ ఏడాది హిందీలో యోధ సినిమాలో నటించింది. ఇక తెలుగులో పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ప్రభాస్ కల్కి 2898ఏడీలో కీలక పాత్రలో కనిపించింది. తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కిన పాన్ వరల్డ్ మూవీ కంగువాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే దిశా పటాని పాత్ర నిడివి కంగువా పార్ట్ 2లో మేజర్ గా ఉంటుందంట.
హిందీలో వెల్ కమ్ టూ ది జంగిల్ అనే సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఇన్ స్టాగ్రామ్ లో దిశా పటానికి ఏకంగా 61.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. రెగ్యులర్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో మోడ్రన్ అవుట్ ఫిట్ లతో సందడి చేస్తూ ఉంటుంది. ఆమె షేర్ చేసే ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తాయి. గార్మెంట్స్ ని కూడా ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటుంది.
ముఖ్యంగా ఇన్నర్ గార్మెంట్స్ ని దిశా పటాని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. వీటితో గ్లామర్ ఫోటోషూట్ లని ఇన్ స్టాలో షేర్ చేస్తూ అందరిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఇన్నర్ గార్మెంట్స్ తో అదిరిపోయే లుక్స్ తో ఉన్న ఫోటోలని పంచుకుంది. ఈ ఫోటోలతో ఆమె అందం కవ్వించేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ స్థాయిలో గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తే ఎలాంటి వారైనా దిశాకి ఫ్యాన్స్ గా మారిపోతారని అంటున్నారు. ఈ ఫోటోలని ఏకంగా 5.5 లక్షల మందికి పైగా లైక్ చేయడం విశేషం.