పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ వైడ్ మార్కెట్ ని అందుకుంటున్న తొలి తెలుగు నటుడిగా అతడి పేరు మార్మోగుతోంది. `బాహుబలి` సక్సెస్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించిన డార్లింగ్ తన స్థాయిని పెంచుకునే ఎత్తుగడలతో ముందుకు సాగడం అతడి ప్రణాళిక అబ్బురపరుస్తోంది. సంక్రాంతి బరిలో డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా `రాధేశ్యామ్` రిలీజ్ కి ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ప్రచారంలో వేగం పెంచింది టీమ్. తెలుగు..తమిళ్..హిందీ ఇలా మూడు భాషల్ని టార్గెట్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంగీతం అందించడం పెద్ద టాస్క్ గా మారిన సంగతి తెలిసిందే.
దక్షిణాది భాషలన్నింటికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తుండగా..హిందీలో మాత్రం ఇద్దరు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. గతంలో మ్యూజికల్ గా `సాహో `వైఫల్యం నేపథ్యంలో ఈసారి దర్శక- నిర్మాతలు వ్యూహం మార్చి ముందుకెళ్తున్నారు. ఒక్కో పాటను ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేయడం సాహోకి గతంలో పెద్ద డ్రా బ్యాక్ అయింది. కో ఆర్డినేషన్ కుదరలేదని టాక్ వచ్చింది అప్పట్లో.
ఈసారి దాన్ని ఓవర్ కమ్ చేయడానికి సౌత్ లాంగ్వేజెస్ మొత్తం ఒక మ్యూజిక్ డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చేసారు. హిందీలో మాత్రం బహుళ సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. ఇటీవల `రాధేశ్యామ్` టీజర్ ని యూనివర్శల్ లాంగ్వేజ్ ఆంగ్ల టైటిల్స్ తో మార్కెట్ లలోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం `ప్రాజెక్ట్ కె` కి మాత్రం దర్శకుడు నాగ్ అశ్విన్ అన్ని భాషలకు ఒకే సంగీత దర్శకుడ్ని ఎంపిక చేసి ముందుకువెళుతున్నారు. ముందుగా మిక్కీ.జె మేయర్ ని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆలోచన విరమించుకుని కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారయణ్ ని తీసుకున్నారు. అయితే ప్రాజెక్ట్ కె విషయంలో సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్ తో ముందుకు వెళ్లడంతో ఫ్యాన్స్ కి రిలీప్ దొరికింది.
ఈ చిత్రంలో దీపిక పదుకొనే- అమితాబ బచ్చన్ సహా పలువురు టాప్ స్టార్లు నటిస్తున్నారు. ప్రభాస్ ఇందులో సూపర్ మేన్ తరహా పాత్రలో నటిస్తారని గుసగుసలు వినిపించాయి. అయితే సైన్స్ ఫిక్షన్ మూవీలో అతడి పాత్ర ఎలా ఉంటుందనేది నాగ్ అశ్విన్ వెల్లడించాల్సి ఉంటుంది. సలార్ - ఆదిపురుష్ 3డి చిత్రాలపై ఇప్పటికే ప్రభాస్ కి చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇక ప్రాజెక్ట్ కె పైనా అతడు పూర్తిగా దృష్టి సారిస్తారని భావిస్తున్నారు.