సూపర్ స్టార్ రజనీకాంత్ తో ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజా చెన్నైలో భేటీ అయ్యారు. మంగళవారం (మే 24) ఉదయం అనూహ్యంగా స్థానిక పోయెస్ గార్డెన్ లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశారు ఇళయరాజా. చాలా కాలం తర్వాత వీరిద్దరూ సమావేశం అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రజినీకాంత్ - ఇళయరాజా ఇద్దరూ పలు విషయాలపై చాలా సేపు ముచ్చటించుకున్నారని తెలుస్తుంది. లెజెండ్స్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రజినీ కాంత్ ఇంట్లోని గోడ పై మహావతార్ బాబాజీ మరియు రాఘవేంద్ర స్వామి ఫోటోలను గమనించవచ్చు. పరమహంస యోగానంద గురువైన లాహిరి మహాస్య గురువుగా చెప్పబడుతున్న బాబాజీకి సూపర్ స్టార్ పరమ భక్తుడనే సంగతి తెలిసిందే.
ఇకపోతే భేటీ అనంతరం ఇళయరాజా రికార్డింగ్ స్టూడియోకు బయలుదేరగా.. రజినీ కూడా ఆయన కారులో వెళ్లారు. జూన్ 2వ తేదీన కోయంబత్తూరులో సంగీత కచేరీ కోసం మ్యూజిక్ మ్యాస్ట్రో రిహార్సల్స్ చేయగా.. రజినీ అక్కడ కొంచెం సేపు రిహార్సల్స్ ను ఎంజాయ్ చేశారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇళయరాజా సడన్ గా రజనీకాంత్ ఇంటికి ఎందుకు వెళ్లారు? ఇరువురి మధ్య ఎలాంటి చర్చ జరిగిందనేది ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో పాటలు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే ఇద్దరూ కలిసి మళ్లీ సినిమా చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
రజినీ కాంత్ - ఇళయరాజా ఇద్దరూ చివరిసారిగా 1994లో 'వీర' సినిమా కోసం కలిసి పనిచేశారు. 28 ఏళ్ల తర్వాత లెజెండరీ కాంబో ఒక్కటవుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. R. బాల్కీ దర్శకత్వంలో రజినీ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూరుస్తారని అన్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
మరోవైపు గతేడాది 'అన్నాత్తే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజినీ కాంత్.. టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్తారేమో చూడాలి.