నాన్న‌ కు ప్రేమ‌ తో ప‌ద్మ‌శ్రీ కావాల‌న్నాడు

Update: 2020-01-07 05:06 GMT
నాన్న కోసం ప్ర‌త్య‌ర్థి బిజినెస్ మేన్ పై జ‌యించేవాడిగా తార‌క్ న‌టించాడు. నాన్న‌కు ప్రేమ‌తో సినిమా అది. సుక్కూ త‌న‌దైన మార్క్ కొడుకుని క్రియేట్ చేశారు. అయితే ప్ర‌తి నాన్న‌కు అంత ప్రేమ పంచే కొడుకు దొర‌క‌డం ఈ కాలంలో క‌ష్ట‌మే. అయితే త‌న‌ని ఇంతింతై అన్న చంద‌గా స్టార్ హీరోని చేసిన నాన్న అర‌వింద్ ని మాత్రం బ‌న్ని ఏమాత్రం విస్మ‌రించ‌డు. వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా త‌న తండ్రిగారి గొప్పత‌నం గురించి ప్యూరిటీ గురించి ప్రశంస‌లు కురిపిస్తుంటారు. అది ప్ర‌శంస కాదు.. ప్రేమ పూర్వ‌క అభినివేద‌నం అని చెప్పాలి. మంగ‌ళ‌వారం సాయంత్రం అల వైకుంఠ‌పుర‌ములో మ్యూజిక్ కాన్సెర్ట్ వేదిక‌ పైనా మ‌రోసారి అర‌వింద్ గొప్ప‌త‌నాన్ని బ‌న్ని గుర్తు చేసుకున్నారు.

బ‌న్ని మాట్లాడుతూ.. నాకు కొడుకు పుట్టాక అర్థ‌మైంది ఒక‌టే. నేను మా నాన్నంత గొప్ప‌గా అవుతానా? నాన్న‌లో స‌గం ఎత్తు ఎదిగినా గొప్ప‌ వాడినే అన్న ఫీలింగ్ క‌లిగింది. నేను నాన్న‌ను ప్రేమించినంత‌గా వేరే ఎవ‌రినీ ప్రేమించ‌ను. ఆర్య టైమ్ లో కోటి సంపాదించుకున్నా. పెళ్ల‌య్యాక నా భార్య‌ను ఒక‌టే అడిగాను. నేను ఎప్ప‌టికీ నాన్నతోనే ఉంటాను అని అడిగాను. నాన్నంటే అంతిష్టం.. అని అన్నారు.

నేను చూసిన వారిలో ది బెస్ట్‌ మా నాన్నే. 45 ఏళ్లుగా ఆయన సినిమాలు.. వ్యాపారం చేస్తున్నాంటే త‌న‌లోని ప్యూరిటీ వ‌ల్ల‌నే. సౌత్‌ ఇండియాలో కానీ ఇండియాలో కానీ నంబర్‌ వన్ నిర్మాత‌గా ఉన్నారంటే స్వచ్ఛ‌త వ‌ల్ల‌నే. మా తాతగారికి పద్మశ్రీ వచ్చింది. అలాగే మా నాన్న గారికి కూడా పద్మశ్రీ రావాలని స‌భా ముఖంగా ప్ర‌భుత్వాన్ని అభ్య‌ర్థిస్తున్నాను. ప‌రిశ్ర‌మ‌ కు ఎంతో చేసిన ఆయ‌న ఆ పుర‌స్కారానికి అర్హుడు.. అని బ‌న్ని ఉద్వేగానికి గుర‌య్యారు.
Tags:    

Similar News