'అర్జున్ రెడ్డి'కి నా సినిమాలే ప్రేరణ: హీరో రాజశేఖర్

Update: 2022-05-19 05:36 GMT
రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో 'శేఖర్' సినిమా రూపొందింది. రేపు ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ .. 'గరుడ వేగ' ఒక తరహా మూవీ .. 'కల్కి' ఒక తరహా సినిమా. ఈ సారి కొత్తగా ఏదైనా  చేయాలని అనుకున్నాను. అలాంటి ఒక మంచి కథ కోసం వెయిట్ చేస్తుండగా, మలయాళ సినిమా 'జోసఫ్' నా దృష్టికి వచ్చింది. ఈ కథ నా బాడీ లాంగ్వేజ్  కి సెట్ అవుతుంది .. రీమేక్ లో నేను చేస్తే బాగుంటుందని భావించి రైట్స్ తీసుకోవడం జరిగింది.

ఈ సినిమా షూటింగుకి వెళదామని అనుకుంటూ ఉండగానే నాకు కరోనా వచ్చింది. ఇక నేను కోలుకోవడం  అసాధ్యం అనుకున్నాను .. ఒక వేళ కోలుకున్నప్పటికీ  ఇకపై సినిమాలు చేయలేనని అనిపించింది. అందువలన మలయాళ సినిమా  రైట్స్ ఎవరికైనా ఇచ్చేయమని జీవితతో చెప్పేశాను కూడా. ఆ స్థితికి వెళ్లిపోయిన నేను అభిమానుల ప్రార్ధనల వలన .. భగవంతుడి దయవలన బ్రతికి బయటపడ్డాను. మొత్తానికి అనేక కష్టాలను ఎదుర్కుంటూ ఈ సినిమాను పూర్తి చేయడం జరిగింది.

ఈ సినిమాలో నా లుక్  చాలా బాగుంటుంది. ఫస్టులుక్ రిలీజ్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లుక్ తో పాటు ఈ సినిమాకి అన్ని కుదిరాయి. అలా అన్ని కుదిరిన సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయి. అందువలన ఈ సినిమా హిట్ అవుతుందనే బలమైన నమ్మకంతో ఉన్నాము.

ఈ సినిమాలో నేను సిగరెట్ తాగుతూ బుల్లెట్ పై వెళ్లే సీన్  చాలామందికి నచ్చింది. యూత్ నుంచి కూడా ఆ సీన్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండ మాదిరిగా ఒక యాటిట్యూడ్ కనిపిస్తోందని వాళ్లు అంటున్నారు.

నిజానికి 'అర్జున్ రెడ్డి' సినిమాకి, అంతకుముందు నేను చేసిన  'శేషు' .. 'ఓంకారం' సినిమాలు ప్రేరణ అని ఒక స్టేజ్ పై దర్శకుడు సందీప్ రెడ్డి చెప్పాడు. ఆ బాడీ లాంగ్వేజ్ ..  యాటిట్యూడ్ మళ్లీ ఈ సినిమాలో కనిపిస్తున్నాయన్నమాట. 'శేఖర్' కథ  .. కథనం చాలా కొత్తగా ఉంటాయి. సెంటిమెంట్ తో కూడిన ఎమోషనల్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అందువల్లనే ఫస్టు షో టాక్ చూసిన తరువాతనే నెక్స్ట్ షోకి వెళ్లమని చెబుతున్నాను. ఈ కంటెంట్ పై ఉన్న నమ్మకంతోనే అలా చెబుతున్నాను" అని అన్నారు.
Tags:    

Similar News