మై హీరో.. జక్కన్న గురించి సుకుమార్‌ పోస్ట్‌ వైరల్‌

Update: 2023-01-11 06:06 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళిని అభిమానించే వారు కోట్లల్లో ఉంటారు. ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం మంది హీరోలను మరియు హీరోయిన్స్ ను అభిమానిస్తూ ఉంటారు. దర్శకులను ఇష్టపడే వారు అభిమానించే వారు ఒకప్పుడు తక్కువగా ఉండేవారు. కానీ జక్కన్న అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండే వారు కోట్లల్లో ఉంటారు.

రాజమౌళి సినిమా అంటే ఒక బ్రాండ్ ను క్రియేట్‌ చేసిన రాజమౌళి ముందు ముందు అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క సినిమా మరియు సన్నివేశం కూడా ఒక యాగం మాదిరిగా రాజమౌళి తీస్తాడు. అందుకే నాకు ఆయన అంటే ఎంతో ఇష్టం అని ఒకానొక సమయంలో సుకుమార్‌ వ్యాఖ్యలు చేశారు.

తాజాగా రాజమౌళి యొక్క ఈ ఫొటోను ఇన్ స్టా గ్రామ్‌ లో షేర్ చేసిన సుకుమార్‌ నా హీరో అంటూ కామెంట్‌ పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. పుష్ప వంటి సూపర్ హిట్‌ తో పాన్‌ ఇండియా స్థాయిలో సుకుమార్‌ క్రేజ్ అమాంతం పెరిగింది.

అయినా కూడా అలాంటి గొప్ప దర్శకుడితోనే మై హీరో అనిపించుకున్నాడు అంటే జక్కన్న స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

సుకుమార్ మరియు రాజమౌళి మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఒకరి సినిమాను ఒకరు ప్రమోట్‌ చేసుకోవడం.. ఒకరిని ఒకరు ఇంటర్వ్యూలు చేసుకోవడం గతంలో పలు సార్లు చూశాం. ఆ సందర్భంగా ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు.

ఇప్పుడు రాజమౌళి నాటు నాటు కు గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు రావడంతో సుకుమార్‌ పోస్ట్‌ మరింత వైరల్‌ అయ్యింది. గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు ప్రకటన కు కొన్ని గంటల ముందు సుకుమార్‌ ఈ పోస్ట్‌ చేసినట్లుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News