మంచు ఫ్యామిలీ పొలిటికల్ స్ట్రాటజీ ప్రస్తుతం తెలుగు ప్రజల్లో హాట్ టాపిక్. ఎన్నికల వేళ మంచు ఫ్యామిలీ ఏపీ రాజకీయాల్లో వేడి పెంచడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. తిరుపతి శ్రీవిద్యానికేతన్ ఫీజు రీఇంబర్స్ మెంట్ వ్యవహారంపై ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ మంచు మోహన్ బాబు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఆయన పెద్ద కుమారుడు, హీరో మంచు విష్ణు సైతం పలు వేడెక్కించే పొలిటికల్ కామెంట్లతో హాట్ టాపిక్ అయ్యారు.
ఇప్పుడు తమ్ముడు మంచు మనోజ్ వంతు. డాడ్ మోహన్ బాబు, అన్న విష్ణులకు విరుద్ధంగా మంచు ఫ్యామిలీ చిన్నోడు మనోజ్ వ్యవహరించడం ఆసక్తికరంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో జోరుగా వుండే మంచు మనోజ్ నెటిజన్‌లు అడిగిన పలు ప్రశ్నలకు షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఇందులో పొలిటికల్ కామెంట్ ఒకటి జనసైనికుల్లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. మనోజ్ ఇంతకీ ఏ పార్టీకి సపోర్ట్? అంటూ డిబేట్ రన్ అవుతోంది.
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్ ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్ అవుతున్న తీరుపైనా వేడెక్కిపోయే కామెంట్లు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్ పై నెటిజనులు రకరకాల ప్రశ్నల్ని సంధించడమే గాక ఇరుకున పెట్టే ప్రశ్నలు వేస్తున్నారు. వాటికి మంచు వారబ్బాయ్ అంతే ధీటుగా జవాబులిస్తున్నాడు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తారా? లేక జనసేనకు ఓటేస్తారా? అని ప్రశ్నిస్తే ఏమాత్రం తడుముకోకుండా ఇంకెవరికి వేస్తాను బ్రదర్.. జనసేనకే.. అందులో మళ్లీ డౌటా? అంటూ సమాధానం చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మంచు వారబ్బాయి ఏంటీ జనసేనకు ఓటేయడం ఏంటి? అనేది అంతు చిక్కనిది. మరి మంచు ఫ్యామిలీలో మనోజ్ వ్యవహార శైలి డిఫరెంట్ అని ఈ సందర్భం చెబుతోంది మరోసారి.