నా భార్య తెలుగమ్మాయే.. ఆనందంగా ఉంది: సోనూసూద్

Update: 2021-06-13 06:41 GMT
స్టార్ యాక్టర్ సోనూసూద్ గురించి దేశవ్యాప్తంగా జనాలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆయన పేరుకు సినిమాలలో విలనిజం చూపించినా.. బయట మాత్రం అంతకన్నా ఎక్కువ సేవాగుణం కలిగిన మంచి మనిషి. ఈ విషయం అందరికి తెలిసిందే. అంటే ఇంతకాలం తెలిసుండక పోవచ్చు కానీ ఈ లాక్డౌన్ సమయంలో అసలు సోనూసూద్ అందరికి పరిచయమయ్యాడు. ఎక్కడ చూసినా సోనూసూద్ గురించి చర్చలు నడుస్తున్నాయి.  అయితే ఇలాంటి గ్రేట్ పర్సనాలిటీ విజయాల వెనుక ఓ లేడీ ఉందని అంటున్నాడు. ఆమెనే సోనూసూద్ భార్య సోనాలి సూద్.

అయితే వీరిద్దరూ కాలేజీ టైంలో పరిచయమై తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. నిజానికి సోనూసూద్ ఎంతటి స్టార్ నటుడో ఆయన భార్య సోనాలి మాత్రం అసలు కెమెరా కంటపడరు. ఆమెకు కెమెరా ముందు షో చేయడం ఇష్టం ఉండదని అంటున్నాడు సోను. అలాగే అసలు సోనుసూద్ భార్య గురించి తెలుసుకోవాలని తెలుగు రాష్ట్రాలలో ఆరాటపడుతున్నారు. ఎందుకంటే ఇటీవలే సోనాలి సూద్ తెలుగమ్మాయి అని తెలిసే సరికి ఆమె గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం ప్రారంభించారు.

అయితే సోనాలి సూద్ నిజంగానే తెలుగు కుటుంబానికి చెందినది. ఆమె డిసెంబర్ 4న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించింది. అలాగే పుట్టి పెరిగిన చోటే అంటే నాగపూర్ లోనే విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పూర్తి చేసింది. కానీ ఆమె తెలుగు కుటుంబానికి చెందింది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలకు చెందిన అమ్మాయి అని తెలుస్తుంది. తెలుగు కుటుంబం కాబట్టి ఆమె ఇంటిపేరు పసుపులేటి అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. అయితే నాగపూర్ లో ఇంజనీరింగ్ చేసే సమయంలో కాలేజీలో సోనూసూద్ ను కలిసిందట. అలా వెంటనే ప్రేమలో పడిన సోనూసూద్ సోనాలికి లేఖలు రాసేవాడు. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి డేటింగ్ వరకు వెళ్ళింది. ఇక ఈ ప్రేమికులు ఇద్దరూ 1996 సెప్టెంబర్ 25న పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు అయాన్ - ఇషాన్.

అయితే తాజాగా ఓ ప్రోగ్రాంలో సోనూసూద్ తన భార్య తెలుగు అమ్మాయి కావడం ఆనందంగా ఉందని అన్నాడు. అలాగే ఏపీ తెలంగాణ రెండు కూడా తనకు సెకండ్ హోమ్ లాంటివని తెలిపాడు. మొదటినుండి సోనుసూద్ విజయంలో సేవలలో ఆయన భార్య సోనాలి ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం సోనూసూద్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Tags:    

Similar News