మన దేశంలో అత్యంత గౌరవం ఉన్న నటుల్లో ముందు అమితాబ్ బచ్చన్ పేరు చెప్పాలి. ఆయన మీద జనాలకు ఇష్టంతో పాటు గౌరవం కూడా ఉంది. అభిషేక్ బచ్చన్ నటుడిగా ఆయన వారసత్వాన్ని ఎంతవరకు అందుకున్నాడన్నది పక్కనబెడితే.. ఆయన గౌరవాన్ని మాత్రం దెబ్బ తీయలేదు. మొదట్నుంచి పద్ధతిగానే నడుచుకుంటున్నాడు. ఐతే ఆయన ఫ్యామిలీకి చెందిన ఓ అమ్మాయి మాత్రం పెద్దాయనకు అప్పుడప్పుడూ ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెడుతోంది. ఆమే.. నవ్య నవేలి నందా. ఈమె అమితాబ్ మనవరాలు అన్న సంగతి తెలిసిందే. ఆయన కూతురికి కూతురన్నమాట. లండన్ లోని ఓ ప్రఖ్యాత ఇన్ స్టిట్యూషన్ లో ఈమెను చదవిస్తోంది అమితాబ్ కుటుంబం.
తన తాతయ్యకు సొసైటీలో ఉన్న గౌరవం గురించి పట్టించుకోకుండా ఈ అమ్మాయి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు అమితాబ్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కానీ.. ఈ అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్వయంగా షేర్ చేస్తున్న ఫొటోలు మాత్రం షాక్ ఇస్తున్నాయి. ఇంతకుముందోసారి బికినీలతో, క్లీవేజ్ షోలతో రెచ్చిపోయిన నవ్య.. లేటెస్టుగా ఓ బ్రిటిష్ కుర్రాడితో క్లోజ్ గా ఉన్న ఫొటోలు సంచలనం రేపుతున్నాయి. ఇతను నవ్య కొత్త బాయ్ ఫ్రెండ్ అని కొందరంటున్నారు. ఐతే అతను కేవలం ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు. ఐతే మరీ అంత క్లోజ్ గా ఉన్న ఫొటోలు షేర్ చేయడం వల్ల జనాలకు రకరకాల సందేహాలు వచ్చేస్తున్నాయ్.