టాలీవుడ్ సీనియర్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా కాలం తరువాత సంక్రాంతి బరిలో సమరానికి సై అంటున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్ లు నటించిన `వాల్తేరు వీరయ్య`, నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` 2023 సంక్రాంతికి పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలని టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
చిరంజీవి నటిస్తున్న `వాల్తేరు వీరయ్య`లో `ముఠామేస్త్రి` నాటి వింటేజ్ చిరుని దర్శకుడు బాబి పరిచయం చేయబోతున్నాడు. అదే మేకోవర్ తో పక్కా మాసీవ్ క్యారెక్టర్ లో చిరు నటిస్తుండగా కీలకమైన పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నాడు. 22 ఏళ్ల విరామం తరువాత చిరు, రవితేజ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవైతే.. లిరికల్ వీడియోలు, రవితేజ క్యారెక్టర్ గ్లిమ్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
జనవరి 13న భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇక నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `వీర సింహారెడ్డి` జనవరి 12న చిరు కంటే వన్ డే ముందే థియేటర్లలో సందడికి రెడీ అవుతోంది. ఇందులో బాలకృష్ణ సీమ ఫ్యాక్షనిస్టుగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంతే కాకుండా బాలయ్య ఇందులో డ్యుయెల్ రోల్ చేస్తున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్, హనీరోజ్, లాల్, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లు భారీ స్థాయిలో నిర్వహించడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు ఏర్పాట్లు చేస్తున్న వేళ ఈ రెండు సినిమాల టికెట్ రేట్లు హైక్ చేయాలని, కనీసం టికెట్ పై రూ. 50 అయినా పెంచుకునే వెసులు బాటుని కల్పించాలని ఏపీ ప్రభుత్వంపై మైత్రీవారు లాబీయింగ్ చేయడం మొదలు పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ రెండు సినిమాలపై భారీగా ఖర్చు చేసిన మైత్రీవారు ఆ మొత్తాన్ని రాబట్టుకునే ప్లాన్ తో ఫస్ట్ వీక్ లోని మొదటి మూడు రోజులు 6 షోలు వేసుకునే విధంగా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించే పనిలో పడ్డారట.
పండగ సీజన్ కావడంతో ఖచ్చితంగా తమ అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారట. మరి ఏపీ ప్రభుత్వం మైత్రీవారికి గుడ్ న్యూస్ చెబుతుందా? లేక అలా కుదరదంటూ షాకిస్తుందో వేచి చూడాలనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.