టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాల కలెక్షన్స్ ఓ రేంజ్ లో హల్ చల్ చేయడం తెలిసిందే. స్టార్ హీరోతో పాటు అభిమానులు కూడా వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. మా హీరో వసూళ్లు ఇంత అంటే మరో హీరో అభిమానులు కూడా ఇదే తరహాలో స్పందిస్తూ మీ హీరో సినిమాని మించి మా హీరో సినిమా వసూళ్లున్నాయని, ఈ విషయంలో మా హీరో సినిమా రికార్డులు సృష్టించిందని లెక్కలు చూపిస్తూ నానా హంగామాచేస్తుంటారు.
సోషల్ మీడియాలోనూ ఈ కలెక్షన్ ల లెక్కలు వైరల్ గా మారి ఇద్దరు హీరోల మధ్య చిచ్చు పెట్టిన సందర్భాలు చాలానే వున్నాయి. అంతే కాకుండా హీరోలు కూడా ప్రీవియస్ మూవీ వసూళ్లని ఆధారంగా చేసుకుంటూ తమ పారితోషికాలను పెంచేస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూ వుంటుంది. దీని ఆధారంగానే మీడియాల్లోనూ వసూళ్ల లెక్కలు ప్రచురిస్తూ హీరోల స్టార్ డమ్ లని అంచనాల వేస్తుండటం గత కొన్నేళ్లుగా జరుగుతూ వస్తోంది.
ఈ ఫిగర్లనే నిర్మాతలు పోస్టర్ లుగా వేసి ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు కూడా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా జరుగుతున్న కలెక్షన్ అంకెల గారడీ హీరోల స్టార్ డమ్ ని డిసైడ్ చేస్తూ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. లెక్కల్లో తప్పులు దొర్లాయని ఎదుటి హీరోల అభిమానులు ఆధారాలతో సహ బయటపెడితే మాత్కం నిర్మాతలు అంతా అభిమానుల కోసం వేసిన లెక్కలు అని వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ దాటవేస్తుంటారు కూడా.
అయితే ఈ లెక్కలకు జీఎస్టీ పెద్ద షాక్ ఇచ్చేసింది. దీని కారణంగా బ్లాక్ మనీ అన్నది ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడం లేదు. అంతా వైట్ మనీతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ నేఫథ్యంలో మైత్రీవారు తీసుకురానున్న కలెక్షన్స్ యాప్ ఆసక్తికరంగా మారింది. నైజాంలో మైత్రీ వారు డిస్ట్రిబ్యూషన్ ని రీసెంట్ గా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంగా తమ సంస్థ నిర్మించిన 'వాల్తేరు వీరయ్య', వీర సింహారెడ్డి' సినిమాలను నైజాంలో వారే స్వయంగా రిలీజ్ చేయడం తెలిసిందే.
తాజాగా కొన్ని థియేటర్లలో సరిగా లెక్కలు చూపించకపోవడంతో మైత్రీ వారికి లెక్షన్ లకు సంబంధించి ఓ యాప్ వుండాలనే ఆలోచన వచ్చిందట. ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఎగ్జిబిటర్ల ఫోన్ లో ఇన్ స్టాల్ చేస్తారట. అందులో ఏ ఆట టికెట్ లెక్కలు ఆ ఆటకే అప్ లోడ్ చేయాల్సిందేనట. దీంతో టికెట్ లెక్కలు, వసూళ్లు కరెక్ట్ గా తెలిసిపోతాయని తెలుస్తోంది. మైత్రీ వారికి వచ్చిన ఐడియా మిగతా నిర్మాతలకు కూడా వస్తే కలెక్షన్ ల లెక్కలు ఇక పారదర్శకంగా వుంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.