మైత్రీ మూవీ మేకర్స్.. ఇప్పుడు టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థ. ఇప్పటివరకూ వీళ్లు తీసినవి మూడు సినిమాలు మాత్రమే. మొదట మహేష్ బాబుతో శ్రీమంతుడు.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో గ్యారేజ్.. రీసెంట్ గా రామ్ చరణ్ తో రంగస్థలం. కానీ ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్.. ఇండస్ట్రీ హిట్స్ మాత్రమే కాదు.. ఆయా హీరోల కెరీర్ బెస్ట్ కూడా.
ముఖ్యంగా రంగస్థలం ఈ నిర్మాతలకు మాత్రమే కాదు.. బయ్యర్స్ అందరికీ కనక వర్షం కురిపించింది. ఇన్వెస్ట్ మెంట్ తో పోల్చితే 40-50 శాతం లాభాలను కళ్లచూసేలా చేసింది. రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత.. మైత్రీ మేకర్స్ నిర్మాతలు అయిన నవీన్ ఎర్నేని.. రవిశంకర్.. మోహన్.. వీరి ఫోకస్ లోను యాటిట్యూడ్ లోను మార్పు వచ్చిందట. ముఖ్యంగా పెద్ద సినిమాలపై మాత్రమే తమ దృష్టి నిలుపుతున్నారట. ఫ్యూచర్ లో చేపట్టబోతున్న ప్రాజెక్టులు.. ఆయా కాంబినేషన్లను సెట్ చేయడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారట. అంతే తప్ప.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చిన్న-మీడియం బడ్జెట్ మూవీస్ గురించి అసలు పట్టించుకోవడం లేదని చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం వీరు నాగచైతన్యతో సవ్యసాచి.. రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. సవ్యసాచి రిలీజ్ కి రెడీ అయిపోగా.. రవితేజ మూవీకి ఇంకా పని ఉంది. కొన్ని రోజుల క్రితం ఏదో పని ఉందంటూ.. ఈ నిర్మాతలను పిలిచాడట రవితేజ. అయితే.. దాదాపు వారం గడిచిపోయినా ఎప్పుడు కలుస్తారనే విషయంపై కనీసం అప్డేట్ కూడా ఇవ్వలేదట మైత్రీ టీం. మూవీ ప్రోగ్రెస్ విషయంలో కూడా అంతగా ఆరా తీయడం మానేసినట్లు ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటున్నారు.