డబ్బు కోసం అనుపమను తీసేయలేదు

Update: 2017-01-27 11:01 GMT

రామ్ చరణ్ సినిమా నుండి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను తప్పించారనే విషయం తెలిసిందే. అయితే ఆమె 60 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అడగటంతో ఆమెను తప్పించారని ఒక టాక్ కూడా వచ్చింది. అందుకే నిర్మాతలు ఆ పైకానికి ఇంకో 20 వేసి సమంతను తీసుకుంటున్నారని కూడా వినిపించింది. అయితే ఈ డబ్బు మ్యాటర్లో నిజం లేదని అంటున్నారు నిర్మాతలు.

మహేష్‌ బాబుతో శ్రీమంతుడు సినిమాను తీసిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను చరణ్‌ తో చేస్తున్నారులే.  ''అనుపమ పరమేశ్వరన్ రామ్ చరణ్‌ మరియు సుకుమార్ ప్రాజెక్టులో లేని విషయం నిజమే కాని..  చాలా న్యూస్ కాలమ్న్స్ లోనూ అలాగే సోషల్ మీడియాలోనూ వస్తున్నట్లు ఆమెను రెమ్యూనరేషన్ కారణంగా తప్పించడం జరగలేదు. ఆమె కూడా ఎప్పుడూ ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్ చేయలేదు. అనుపమ చాలా టాలెంటడ్ అమ్మాయి. ఇప్పుడు కాకపోతే తరువాత ఆమె మాతో పనిచేస్తుంది'' అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రకటించారు.

ఇకపోతే గతంలో ఈ సినిమా గురించి వచ్చిన మరో రూమర్ ఏంటంటే.. అనుష్క కమర్షియల్ హీరోయిన్ గా అందాలను ఆరబోయలేనని చెప్పడంతోనే ఆమెను తప్పించారని వినిపించింది. ఏదేమైనా కూడా అనుపమ డబ్బు మనిషి కాదని ప్రొడ్యూసర్లే క్లారిటీ ఇవ్వడం మంచి పరిణామమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News