గ్యాంగ్ లీడర్ ని వాళ్ళు లైట్ తీసుకున్నారా?

Update: 2019-07-14 06:50 GMT
నిన్న నాని గ్యాంగ్ లీడర్ ప్రీ లుక్ వచ్చింది. ఓ ఆరు చేతులు తప్ప అందులో ఏ విశేషం లేదు కాబట్టి సోషల్ మీడియాలో సైతం అంతగా ట్రెండింగ్ కాలేకపోయింది. ఒకవేళ కంప్లీట్ లుక్ వచ్చాక ఏమైనా అభిప్రాయాలు మారతాయేమో చూడాలి. ఇదిలా ఉండగా గ్యాంగ్ లీడర్ నిర్మాణ సంస్థ మైత్రి ఈ నెలాఖరున రాబోతున్న డియర్ కామ్రేడ్ మీద పెడుతున్నంత ఫోకస్ గ్యాంగ్ లీడర్ మీద పెట్టడం లేదనే కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

డియర్ కామ్రేడ్ తమిళ్ కన్నడ మలయాళంలోనూ విడుదల కాబోతోంది. అలా అని ఇది అన్ని బాషలలో తీసింది కాదు. అక్కడ డబ్బింగ్ రూపంలో రిలీజ్ చేస్తారు. కాని ఆల్రెడీ ఆన్ లైన్ లో వదిలిన మ్యూజిక్ ని లాంచ్ చేయడానికి బెంగుళూరులో పెద్ద ఈవెంట్ చేయడం అక్కడి మీడియాను సైతం ఆశ్చర్యపరిచింది. అంతే కాదు కోచి చెన్నై హైదరాబాద్ లో వరసగా ప్లాన్ చేశారు

అంత ఉత్సాహం గ్యాంగ్ లీడర్ విషయంలో చూపించడం లేదనే నాని అభిమానుల కంప్లైంట్. నిన్న కూడా జస్ట్ ఆన్ లైన్ లో వదిలారు తప్ప పోస్టర్ గురించి ఇంకే ప్రమోషన్ చేయలేదు. ముందు రోజు నానినే స్వయంగా ఓ వీడియో పోస్ట్ చేశాడు తప్పించి అంతకు మించి యూనిట్ నుంచి ఇంకా హైప్ తెచ్చే ప్రయత్నాలు చేయడం లేదు.

విడుదలకు అటుఇటుగా ఒక నెల రోజులే ఉన్న తరుణంలో టైటిల్ విషయంలో కాస్త కినుకు వహిస్తున్న మెగా ఫ్యాన్స్ ని ప్రసన్నం చేసుకోవడంతో పాటు కమర్షియల్ గా గ్యాంగ్ లీడర్ ని పెద్ద రేంజ్ లో ప్రొజెక్ట్ చేయాలంటే ఈ స్ట్రాటజీ చాలదు. అందుకే మైత్రి తీరు చూసి నాని దర్శకుడు విక్రం కుమార్ అంత సంతృప్తికరంగా లేరని ఇన్ సైడ్ టాక్. ఎప్పుడు స్పీడ్ పెంచుతారో మరి


Tags:    

Similar News