ఎన్టీ రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. బాలయ్య స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ గా బాలయ్య నటించడంతో పాటు ఇతర పాత్రల్లో కూడా ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పాత్రను రానా - ఏయన్నార్ పాత్రను సుమంత్ - బసవతారకం పాత్రను విద్యా బాలన్ పోషిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కూడా కనిపించబోతున్నారు.
ఎన్టీఆర్ సినిమా రంగంలో అడుగు పెట్టిన ప్రారంభంలో పలు పౌరాణిక చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రాల్లో ఎక్కువగా విఠలాచార్య దర్శకత్వం వహించారు. పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరైన విఠలాచార్య తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అద్బుతమైన చిత్రాలను అందించారు. ఎన్టీఆర్ మరియు విఠలాచార్యకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. అందుకే ఈ చిత్రంలో విఠలాచార్య పాత్రను ప్రత్యేకంగా దర్శకుడు క్రిష్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ సినిమా కెరీర్ కు సంబంధించిన సీన్స్ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సమయంలోనే విఠలాచార్య సీన్స్ ను పూర్తి చేశారట. విఠలాచార్య పాత్రలో ఈతరం దర్శకుడు ఎన్ శంకర్ నటించినట్లుగా సమాచారం అందుతుంది. తాజాగా విఠలాచార్య పాత్ర షూటింగ్ లో తాను పాల్గొన్నట్లుగా సన్నిహితుల వద్ద ఎన్ శంకర్ చెప్పినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ఇంకా ఎంత మంది ఈ చిత్రంలో తారలు తళుక్కుమంటారో అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.