అయ్యో... మా సినిమా కాపీ కాదు

Update: 2018-01-30 09:53 GMT
త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌రే  సినిమాను కాపీ కొట్టాడ‌ని రూమ‌ర్లు వ‌చ్చాయి. అవి దాదాపు నిజ‌మే అని కూడా తేలింది. అజ్ఞాతవాసి సినిమాను లార్గొ వించ్ అనే ఫ్రెంచ్ సినిమాకు కాపీ అని ఆ రెండు సినిమాలు చూసిన వాళ్లంద‌రూ అన్నారు. అంతేకాదు సాక్షాత్తూ లార్గో వించ్ డైరెక్ట‌ర్ కూడా ట్విట్ట‌ర్‌లో అదే విష‌యాన్ని చెప్పారు. ఆ దెబ్బ‌తో ఇప్పుడు ఏఏ సినిమాలు ఇత‌ర దేశాల సినిమాల కాపీల అని వెత‌క‌డం ప్రారంభించారు సినీ జ‌నాలు. ఆ త‌ల‌నొప్పి నా పేరు సూర్య సినిమాకు కూడా చుట్టుకుంది.

అల్లు అర్జున్ హీరోగా - వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య‌. ఈ సినిమా యాంట్‌ వోన్ ఫిష‌ర్ అనే ఆంగ్ల మూవీకి కాపీ అని టాక్ వ‌చ్చింది. ఆ టాక్ చిత్ర యూనిట్ చెవిలో ప‌డింది. దీంతో ద‌ర్శ‌కుడితో పాటూ చిత్ర టీమ్ అంతా త‌మ సినిమా ఏ మూవీకి కాపీ కాద‌ని చెబుతున్నారు. యాంట్‌ వోన్ ఫిష‌ర్ సినిమాకు త‌మ సినిమా అస‌లు సంబంధ‌మే లేద‌ని చెప్పారు. వీరు చెప్పేది ఎంత వ‌ర‌కు నిజ‌మో సినిమా విడుద‌ల‌య్యాక తేలిపోతుందిగా అంటున్నారు ఫిల్మ్ న‌గ‌ర్ వాసులు.

నా పేరు సూర్య సినిమా ద్వారా తెలుగు తెర‌కు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు వ‌క్కంతం వంశీ. ఇంకా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఉంది. అతి త్వ‌ర‌గా షూటింగ్ ముగించుకుని... భ‌ర‌త్ అను నేను సినిమా క‌న్నా ముందే విడుద‌ల చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది చిత్ర యూనిట్‌.
Tags:    

Similar News