వేసవి రేసులో ఉన్న మూడు భారీ సినిమాల్లో రెండు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ‘రంగస్థలం’ రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లతో దూసుకెళ్లగా.. ‘భరత్ అనే నేను’ ఓ మోస్తరు కలెక్షన్లతో నడుస్తోంది. ఇక తెలుగు ప్రేక్షకుల కళ్లన్నీ ‘నా పేరు సూర్య’ మీదే ఉన్నాయి. ఇంకో మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ చిత్రం భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లే దీనికి బిజినెస్ కూడా భారీగానే జరిగింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కుల్ని రూ.75 కోట్లకు అమ్మారు. థియేట్రికల్ రన్ లో వరల్డ్ వైడ్ షేర్ ఆ మార్కును దాటితేనే ఇది హిట్ అనిపించుకుంటుంది.
ఏరియాల వారీగా లెక్కలు చూస్తే.. ‘నా పేరు సూర్య’ నైజాం హక్కుల్ని రూ.18.1 కోట్లకు అమ్మారు. సీడెడ్ రైట్స్ రూ.11 కోట్లు పలికాయి. వైజాగ్ ఏరియా హక్కుల్ని రూ.7.5 కోట్లకు అమ్మారు. తూర్పుగోదావరికి రూ.5.2 కోట్లు.. పశ్చిమగోదావరికి రూ.4.2 కోట్లు.. కృష్ణాకు రూ.4.5 కోట్లు.. గుంటూరుకు రూ.5.5 కోట్లు.. నెల్లూరుకు రూ.2.5 కోట్లు.. ఇలా పలికాయి రేట్లు. తెలుగు రాష్ట్రాల వరకు రూ.58.5 కోట్లకు బిజినెస్ చేసిందీ చిత్రం. ఓవర్సీస్ లో బన్నీ కొంచెం వీక్ కావడంతో హక్కులు రూ.6 కోట్లే పలికాయి. దీంతో పోలిస్తే కర్ణాటక రైట్స్ రూ.7 కోట్లతో మెరుగనిపించాయి. బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉన్న కేరళ హక్కుల్ని రూ.1.5 కోట్లకు అమ్మారు. మిగతా ఏరియాల రైట్స్ రూ.2 కోట్ల దాకా పలికాయి. ఇలా మొత్తం రూ.75 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేసిందీ చిత్రం. శాటిలైట్ ద్వారా రూ.25 కోట్లు.. ఇతర హక్కుల ద్వారా మూడున్నర కోట్లు.. ఇలా మొత్తం కలిపితే ‘నా పేరు సూర్య’ రూ.103 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టడం విశేషం.