ఇప్పుడు సమ్మర్ సీజన్ అంతా కూడా డిఫరెంట్ సినిమాలతో వేడెక్కిపోతోంది. ఆల్రెడీ రామ్ చరణ్ రంగస్థలం మరియు మహేష్ బాబు భరత్ అను నేను సినిమా చూసిన తరువాత.. ఇప్పుడు ఆడియన్స్ ను ఎంటర్టయిన్ చేయడానికి మరో పెద్ద హీరో.. ఒక డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. కావల్సినంత మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే.. క్యారక్టరైజేషన్ ను నమ్ముకున్న ఆ హీరో ఎవరో కాదు.. మన స్టయిలిష్ స్టారే.
''నా పేరు సూర్య'' అంటూ ఇప్పుడు దూసుకొస్తున్నాడు అల్లు అర్జున్. అసలు రైటర్ వక్కంతం వంశీకి ఇది తొలిసారి డైరక్షన్ చేస్తున్న సినిమా అంటే ఎవ్వరూ నమ్మలేరనే చెప్పాలి. ఆ రేంజులో మనోడు పిచ్చెక్కించాడు. కోపంతో సతమతమయ్యే ఆర్మీ మనిషి సూర్య. ఆ కోపం కారణంగా ఒక టెర్రిరిస్టును చంపేయండంతో.. మనోడ్ని ఆర్మి నుండి బయటకు పంపిస్తారు. ఆ తరువాత ఏం జరిగింది అనేదే సినిమా కథ. సినిమా ట్రైలర్లో మొత్తంగా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ సూపర్ హైలేట్ అని చెప్పాలి. అసలు మనోడు ఎక్కడా తగ్గకుండా.. తనకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించే సీన్లన్నీ అరిపించేశాడు. పైగా పాత్ర కోసం వెయిట్ పెంచి.. కాస్త ట్యానింగ్ చేసుకుని.. ఆర్మీ హెయిర్ కట్ చేయించుకుని.. అబ్బా అనిపించాడు అంతే. ఇతర పాత్రధారులు అయిన అర్జున్.. శరత్ కుమార్.. అను ఎమ్మానుయేల్ కూడా బాగానే ఉన్నారు.
ఇతర విషయాలను గూర్చి చెప్పాలంటే.. అల్లు అర్జున్ అగ్రసివ్ పాత్రధారణకు.. రాజీవ్ రవి సినిమాటోగ్రాఫితో పాటు.. విశాల్-శేఖర్ మ్యూజిక్ అదిరిపోయాయ్. మొత్తంగా వక్కంతం వంశీ భలే సినిమాను కూర్చాడనే చెప్పాలి. మాస్ కు కావల్సిన అంశాలను జోడిస్తూ.. కోపం అనే ఒక ఎలిమెంట్ ను డీల్ చేస్తూ.. దేశానికి సంబంధించిన ఒక కథను చెప్పడం అంటే.. అదిరిపోయిందనే చెప్పాలి. చూస్తుంటే మే 4న టాలీవుడ్ మరో బ్లాక్ బస్టర్ చూడబోతుందేమో అనిపిస్తోంది.
ట్రైలర్ కోసం క్లిక్ చేయండి
Full View