న‌గ‌దారిలో.. విప్ల‌వాన్ని మించిన ప్రేమ‌

Update: 2022-06-02 08:30 GMT
రానా ద‌గ్గుబాటి హీరోగా న‌టిస్తున్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించింది.  ఆలోచ‌నాత్మ‌క క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్కిన 'నీది నాది ఒకే క‌థ‌' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంయి గుర్తింపుని సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల మ‌లి ప్ర‌య‌త్నంగా తెర‌కెక్కించిన చిత్ర‌మిది. విప్ల‌వానికి ప్రేమ‌కు ముడిపెడుతూ ఓ దృశ్య‌కావ్యంగా 'విరాట‌ప‌ర్వం' ని రూపొందించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ ఎల్ వీ సినిమాస్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ చెరుకూరి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని నిర్మించారు.

గ‌త ఏడాది కాలంగా రిలీజ్ విష‌యంలో సందిగ్థ‌త నెల‌కొన్నఈ మూవీని జూలై 1న విడుద‌ల చేస్తున్న‌ట్టుగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే రిలీజ్ ఆల‌స్యం అయింద‌ని, 55 రోజుల పాటు వేచి చూడ‌లేద‌మ‌ని, జూన్ లో పెద్ద సినిమాలేవీ లేవు.

అలాంటప్పుడు జూన్ లో విడుద‌ల చేస్తే బాగుంటుంది క‌దా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. దీంతో రియ‌లైజ్ అయిన చిత్ర బృందం సినిమా రిలీజ్ ని జూలై నుంచి జూన్ 17కు మారుస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించి అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేశారు.

సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ ని ప్రారంభించారు. ఇందులో భాగంగా గురువారం 'న‌గాదారిలో..'అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేస్తున్నామంటూ బుధ‌వారం సాంగ్ ప్రోమోని విడుద‌ల చేశారు. చెప్పిన‌ట్టుగానే గురువారం పూర్తి సాంగ్ కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాట‌కు ద్యావ‌రి న‌రేంద‌ర్ రెడ్డి, సానాప‌తి భ‌ర‌ద్వాజ్ పాత్రుడు సాహిత్యాన్ని అందించారు.

'నిప్పూ వుంది నీరూ ఉంది న‌గా దారిలో అంటూ సాగే ఈ పాట‌ని సాయి ప‌ల్ల‌వి, రానాల మ‌ధ్య చిత్రీక‌రించారు. అడ‌విలో త‌న‌తో సాగుతూ త‌న ప్రేమ కోసం త‌న వెంట న‌డిచే ఓ యువ‌తిగా సాయి ప‌ల్ల‌వి, ఆ యువ‌తి ప్రేమ కోసం.. ద‌న దారిలో ఎదుర‌య్యే అవాంత‌రాల‌ని ప‌సిగ‌డుతూ అనుక్ష‌ణం అప్ప‌మ‌త్తంగా వుంటే ఓ ఉద్య‌మ నాయ‌కుడిగా రానా క‌నిపించారు. విప్ల‌వాన్ని మించిన ప్రేమ‌క‌థ‌గా ఈ పాట‌లో వారిని వ‌ర్ణించిన తీరు ఆక‌ట్టుకుంటోంది.

దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా కోసం చ‌ర్చ న‌డుస్తున్న నేప‌థ్యంలో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌ల ఎపిక్ క్లాసిక్ మూవీని అందిస్తాన‌ని రానా ప్రామిస్ చేయ‌డంతో ఆ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ప్రియ‌మ‌ణి, న‌వీన్ చంద్ర‌, నందితా దాస్‌, ఈశ్వ‌రీరావు, సాయి చంద్‌, నివేదా పేతురాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Full View
Tags:    

Similar News