కమర్షియల్ రైటర్ తో నాగ్ బిగ్ ప్లాన్!

Update: 2022-11-23 04:33 GMT
అక్కినేని నాగార్జున ఇటీవల కాలంలో మళ్ళీ వరుస డిజాస్టర్ లతో సతమాతమవుతున్నాడు. కొన్నేళ్ల క్రితం సోగ్గాడే చిన్నినాయన సినిమాతో 50 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకుని తన స్టార్ హోదాను పెంచుకున్నాడు. అయితే ఆ తర్వాత మళ్లీ మన్మధుడు 2 సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఇక మధ్యలో ఆయన ప్రయోగాలు చేయడం కూడా తగ్గలేదు. ఆ విధంగా చేసిన సినిమాలన్నీ కూడా బెడిసికొట్టాయి.

రీసెంట్ గా వచ్చిన ది గోస్ట్ సినిమా కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇక నాగార్జున తదుపరి సినిమాల విషయంలో ఇప్పుడు మరింత ఫోకస్ చేయబోతున్నాడు. అయితే కొత్తవారికి కూడా అవకాశాలు ఇవ్వాలి అని నాగ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ప్రముఖ రైటర్ కు సినిమా చేయడానికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ రైటర్ మరెవరో కాదు. మొదట జబర్దస్త్ ద్వారా మంచి కామెడీ రైటర్ గా గుర్తింపు అందుకున్న ప్రసన్నకుమార్ అని తెలుస్తోంది.

ఇంతకుముందు ఈ రైటర్ సినిమా చూపిస్త మామ నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే..  సినిమాలకు రచయితగా వర్క్ చేశాడు. అతని సినిమాలన్నిటికీ కూడా దాదాపు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఈ కాంబినేషన్లో దమాకా అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రసన్నకుమార్ రైటర్ నుంచి డైరెక్టర్ గా మారాలని అనుకుంటున్నాడు.

అందుకే నాగర్జునతో అతను తను మొదటి కథను వినిపించాడట. ఇక కథ కాస్త కొత్తగా మంచి ఎంటర్టైన్మెంట్ అంశాలు ఉండడంతో నాగార్జున ఓకే చేయాలని ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి.

ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత నాగార్జున మరోసారి ఈ రైటర్ తో సిట్టింగ్ వేసే అవకాశం ఉంది. మరి ఫైనల్ నెరేషన్లో ప్రసన్నకుమార్ ఈ స్టార్ హీరోని మెప్పిస్తాడో లేదో చూడాలి. ఇక మోహన్ రాజాతో కూడా నాగ్ తన 100వ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. త్వరలోనే ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ రానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News