కింగ్ నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి దశలో ఉండగానే వరుస సినిమాలను ప్రకటించేసాడు. ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్ సినిమా థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా పై చాలా ఆశలే పెట్టుకున్నాడు నాగ్. ఇదిలా ఉండగా.. 'సోగ్గాడే చిన్నినాయన' సూపర్ హిట్ తర్వాత దాని సీక్వెల్ బంగార్రాజు సినిమా కూడా గతంలోనే అనౌన్స్ చేసాడు నాగ్. అయితే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసాడట డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈసారి బంగార్రాజు సినిమాలో నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తుండగా.. మరో హీరోకు అవకాశం ఉందని ఆ పాత్రలో నాగచైతన్యను ఓకే చేసినట్లు టాక్ వినిపించింది. నిజానికి నాగ్ - నాగచైతన్య కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కించాలని అనుకున్నారట.
ఇదిలా ఉంటే.. నాగ్ తన చిన్నకొడుకు అఖిల్ తో పాటు మల్టీస్టారర్ లో కనిపించే అవకాశం ఉన్నట్లు టాక్. ప్రస్తుతం నాగ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ యాక్షన్ ప్యాకెడ్ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత బంగార్రాజు సినిమాలో నటిస్తాడు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత అఖిల్ తో కలిసి మల్టిస్టారర్ సినిమా చేస్తాడని ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆ సినిమాను లూసిఫర్ ఫేమ్ మోహన్ రాజా రూపొందిస్తాడని టాక్. అంతేగాక ఈ మల్టీస్టారర్ సినిమాను భారీ బడ్జెట్ తో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగ్ నిర్మిస్తాడని ఇండస్ట్రీలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాలలో నిజంగా చైతూ, అఖిల్ కనిపిస్తే గనక అక్కినేని ఫ్యాన్స్ కి పండగే అని చెప్పవచ్చు. మరి అధికారిక వార్తలు వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.