పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న క్రేజీ మూవీ `ప్రాజెక్ట్ కె` అ్తత్యంత చర్చనీయాంశంగా మారుతోంది. కారణం ఇది రెగ్యులర్ ఫార్మాట్ లో తెరకెక్కుతున్న సినిమా కాదు. హాలీవుడ్ స్టాయి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ఇండియన్ ప్రేక్షకులకు అందించాలనే మహత్తరమైన ఆలోచలనతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఊహకందని కథ, కథనాలతో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ ఇది.
వైజయంతీ ఊవీస్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ ఈ ప్రాజెక్ట్ ని అత్యంత భారీ స్థాయిలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకునే, దిషా పటానీ నటిస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు సినీ చరిత్రలోనే ఇంత వరకు ఎవరూ టచ్ చేయని కథతో అత్యంత భారీ నిర్మాణ విలువలతో ఈ మూవీని రూపొందింస్తున్నారు.
ఈ మూవీ కోసం నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమా కథనం ప్రకారం కొత్త తరహా వెహికిల్స్ ని వాడుతున్నారట. ఆ కారణంగానే ఆనంద్ మహీంద్రా సహాయాన్ని అడిగిన నాగ్ అశ్విన్ తాజాగా మరో అప్ డేట్ ని వదిలారు. `మహానటి` కోసం ఆ కాలం నాటి కార్లని ప్రత్యేకంగా అద్దెకు తీసుకుని చేశాం. కానీ `ప్రాజెక్ట్ కె` విషయంలో అలా చేయడానికి ఎక్కడా ఆస్కారం లేదు. ఎందుకంటే సినిమాకు సంబంధించిన ప్రతీదీ కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సిందే.
`ప్రాజెక్ట్ కె`. కోసం వెహికిల్స్ కావాలంటే `మహానటి` తరహాలో అద్దెకు తీసుకురావడానికి వీళ్లేదు. సొంతంగా తయారు చేసుకోవాల్సిందే. అంటే సినిమాని సరికొత్త వరల్డ్ లో ఈ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నట్టుగా తన మాటలని బట్టి తెలుస్తోంది. టైమ్ ట్రావెల్ మూవీగా ఈ సినిమాని తెరపైకి తీసుకొస్తున్నట్టుగా ఇప్పటికే ఓ వార్త నెట్టింట గత కొన్ని నెలలుగా వైరల్ అవుతూ వస్తోంది. ఆ వార్తకు బలాన్ని చేకూరుస్తూ ఈ మూవీ సరికొత్త వరల్డ్ లో వుంటుందని నాగ్ అశ్విన్ తెలియజేయడం గమనార్హం.