రజినీని ఫాలో అవుతున్న మెగా బ్రదర్

Update: 2017-03-30 07:56 GMT
ఏ విషయంలో అయినా సూపర్ స్టార్ రజినీకాంత్ ను ట్రెండ్ సెట్టర్ అనాల్సిందే. పంచ్ డైలాగ్స్.. స్టైలిష్ మేనరిజమ్స్.. చివరకు నడకలో కూడా తనదైన స్టైల్ ను చూపించడం రజినీకి అలవాటు. దాన్ని ఫాలో అయిపోవడం ఆయనకు అలవాటు. రజినీ ఒకసారి చూపించిన స్టైల్.. కొన్నేళ్లపాటు ట్రెండింగ్ లోనే ఉంటుంది.

కబాలి మూవీలో రజినీకాంత్ గెటప్ కూడా ఇలాంటిదే. ఓల్డేజ్ గెటప్ లో రజినీ చూపించిన నటనకు.. ఆయన స్టైల్స్ కు వహ్వా అనేశారు అభిమానులు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. రజినీ చూపించిన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కేకలు పుట్టించేసింది. ఇప్పుడు చాలామంది హీరోలు ఈ లుక్ లో కనిపిస్తున్నారు కానీ.. రజినీ స్టైల్ ఎవరికీ రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు.. రజినీకాంత్ స్టైల్ ను ఫాలో అయిపోతున్నట్లుగా కనిపిస్తోంది. జబర్దస్త్ కామెడీ షోను కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఈయన.. ఇప్పటి వరకూ నార్మల్ లుక్ లోనే ఉన్నారు.

కానీ ఈ మధ్య ట్రెండ్ మార్చేసి.. కంప్లీట్ గా తెల్లగెడ్డంతో కబాలి స్టైల్ లో కనిపించేస్తున్నారు. ఈ మధ్య ఓ సారి కబాలి రేంజ్ లో పార్టిసిపెంట్స్ పై రెచ్చిపోయారు కూడా. అది స్కిట్ లో కామెడీ లేకపోవడంతో వచ్చిన కోపమో.. కబాలి గెటప్ లో ఉన్న పవరో చెప్పాలంటే కొంచెం కష్టమే కదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News