పవన్ మూడు పెళ్లిళ్లపై నాగబాబు కామెంట్

Update: 2018-12-09 17:47 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. దీనిపై ఎప్పట్నుంచో వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి కానీ.. ఇటీవల ఇవి మరింత ఊపందుకున్నాయి. పవన్ భార్యల్ని మార్చడం.. మోసం చేయడం ఏ నైతికత అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు విరుచుకుపడ్డ నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. పవన్ తన వ్యక్తిగత విషయాలపై మాట్లాడొద్దంటున్నాడే తప్ప.. ఈ విషయంపై తన వాదన వినిపించట్లేదు. ఐతే అతడికి మద్దతుగా అన్న నాగబాబు లైన్లోకి వచ్చారు. పవన్ మూడు పెళ్లిళ్ల విషయమై వివరణ ఇచ్చాడు. ఈ వ్యవహారంపై నాగబాబు ఏమన్నాడంటే..

పవన్ వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడటం కరెక్టో కాదో నాకు తెలియదు. కానీ ఈ విషయంపై నా అభిప్రాయాలు చెబుతాను. కళ్యాణ్ మొదట ఒక అమ్మాయిని పెళ్లి చేసకున్నాడు. ఆ అమ్మాయతో సరిపడలేదు. చాలా మర్యాదగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. రెండు కుటుంబాల ఉమ్మడి అంగీకారంతో కోర్టు నిబంధనలకు లోబడి చట్టపరంగా ఏమేం చేయాలో అన్నీ చేసి విడాకులు ఇచ్చేశాడు. తర్వాత రేణు దేశాయ్ తో ఒక అండర్ స్టాండింగ్ ఏర్పడింది. కొంత కాలం కలిసున్నారు. పెళ్లి చేసుకున్నారు. వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చాయో ఏమో.. ఇద్దరూ ఉమ్మడి అంగీకారంతోనే విడిపోయారు. విడాకులు ఎవరు ముందు అడిగారో తెలియదు. ముందు ఉన్న ఇద్దరినీ నేను విమర్శించను. ఎందుకంటే వాళ్లు ఆడపిల్లలు. ఆ ఇద్దరూ మా కుటుంబంతో అంతగా కలిసేవారు కాదు. కొంచెం డిఫరెంటుగా ఉండేవారు. ఇక ఇప్పుడున్న అమ్మాయి రష్యన్ అయినా పూర్తిగా భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తుంది. ఈ రోజుల్లో మేం కూడా కొన్ని ఫార్మాలిటీస్ మరిచిపోతున్నాం. కానీ ఆ అమ్మాయి అన్నీ చేస్తుంది. ఆమెను చూస్తే ముచ్చటేస్తుంది. చిరంజీవి అన్నయ్య దగ్గర నుంచి మా కుటుంబంలో అందరూ ఆమెను ఇష్టపడతారు. తను స్వీట్ గర్ల్. కళ్యాణ్ బాబుకు ఇప్పటికి ఒక మంచి అమ్మాయి దొరికిందని నా ఫీలింగ్. ఆమె పవన్ కు నచ్చిన అమ్మాయి, తనకు అనుకూలంగా ఉండే అమ్మాయి’’ అని నాగబాబు అన్నాడు.


Tags:    

Similar News