20 కోట్ల నష్టం.. నాగబాబు ఏం చేశాడంటే?

Update: 2016-12-02 04:17 GMT
వ్యాపారంలో కోట్ల రూపాయల నష్టం వాటిల్లితే డిప్రెషన్లోకి వెళ్లిపోయి అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు చాలామంది. ఐతే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ఎవ్వరూ ఊహించని పని చేశాడు. 50 ఏళ్లకు చేరువ అవుతున్న సమయంలో సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నం చేశాడు. ‘ఆరెంజ్’ సినిమాతో దారుణమైన ఫలితాన్నందుకున్న టైంలో డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఆయన చేసిన ప్రయత్నమిది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. గతంలో ‘అంజనా ప్రొడక్షన్స్’ బేనర్ మీద మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో హిట్ సినిమాలు చేసిన నాగబాబు. తొలిసారిగా రామ్ చరణ్ తో ‘ఆరెంజ్’ సినిమా చేశాడు. దీని దెబ్బకు నాగబాబు సినిమాల నిర్మాణమే ఆపేయాల్సి వచ్చింది.

దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్లో ‘ఆరెంజ్’ సినిమా తీస్తే.. సగానికి సగం నష్టం వచ్చింది. దీంతో తీవ్ర మనో వేదనకు గురైన నాగబాబు.. ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయాడట. అలాంటి టైంలోనే ఆయన చిత్రంగా సిక్స్ ప్యాక్ చేయడం మొదలుపెట్టాడట. కొన్ని నెలల పాటు రెగ్యులర్‌ గా జిమ్‌ కు వెళ్లి సిక్స్ ప్యాక్ యాబ్స్ కూడా తెచ్చుకున్నాడట. ఐతే ఫినిషింగ్ టచ్ ఇవ్వకుండానే ఆ కష్టానికి తెర దించాడట నాగబాబు. అప్పటికే ‘ఆరెంజ్’ తాలూకు బాధ నుంచి బయటికి వచ్చేయడమే అందుక్కారణం. 50 ఏళ్లకు దగ్గరవుతున్న సమయంలో సిక్స్ ప్యాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఇలా డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి సిక్స్ ప్యాక్ ప్రయత్నించడం అన్నది ఆశ్చర్యకరమైన విషయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News