డబ్బున్న చోట అనుబంధం తక్కువ ఉంటుంది అంటారు. హోదా ముందు ఆప్యాయత కరువవుతుంది అంటారు. అవును చాలా వరకు ఈ రోజుల్లో డబ్బుతో కూడుకున్న ప్రేమ హోదా ఉంటేనే ఆప్యాయతలు ఉంటాయి అనే స్థితికి ప్రపంచం వచ్చింది. కానీ అప్పుడప్పుడు నిజమైన ప్రేమల ముందు డబ్బు- హోదా చిన్నబోతాయి అనడానికి కొన్ని సార్లు ప్రేమ జంటలు చూపిస్తాయి.
ఇప్పుడు అందరూ అక్కినేని పెళ్లి జంట గురించే మాట్లాడుకుంటున్నారు. వ్యక్తిగతంగా నాగ చైతన్య - సమంత ఎంతో హోదా కలిగినవారు. వారి ప్రేమను చూస్తే ఇలాంటి వారిలో కూడా ఇంత ఆప్యాయతలు ఉంటాయా అనిపిస్తుంటుంది. అసలైన ప్రేమకు నిదర్శనంలా వారు ఒకటైన బంధాన్ని చూస్తే ఎవ్వరికైనా ప్రేమ ఇంత గొప్పదా అనక మానరు. జీవితంలో ఎంతటివారైనా ప్రేమను ధాటి వెళ్ళలేరు. కానీ దాన్ని చివరివరకు అందరు నిలుపుకోలేరు.
ముఖ్యంగా సినీ తారల మధ్యలో ప్రేమలు ఏడాది ఉన్నా గొప్పే అనే టాక్ ఉంది. పెళ్లి వరకు వెళతాయని ఎవరూ ఊహించరు. అయితే నాగ చైతన్య - సమంత నాలుగేళ్లు ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని చివరకి పెళ్లి చేసుకున్నారు. గోవాలోని డబ్ల్యు రిసార్ట్ లో ఇరు కుటుంబాల ఆనంద చిరునవ్వుల మధ్యన హిందూ సంప్రదాయం ప్రకారం ఒకటయ్యారు. కరెక్ట్ గా ముహూర్తం సమయానికి నాగ చైతన్య - సమంత మెడలో మూడు ముళ్ళు వేయగా అక్కినేని - దగ్గుపాటి ఫ్యామిలీ వారు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇక ఈ రోజు సమంత కుటుంబం వారు నిర్వహించే క్రిస్ట్రియన్ మ్యారేజ్ మరింత గొప్పగా జరగనుంది.
నిజంగా చెప్పాలంటే ఇన్నేళ్ళలో సమంత - నాగచైతన్య ఎప్పుడు ఏ తరహా నెగిటివ్ కామెంట్స్ తెచ్చుకోకుండా ఫైనల్ గా ఫ్యామిలీ ఇష్ట ప్రకారం వారు మూడు ముళ్ల బంధం వరకు వచ్చారు. ఇరు సంప్రదాయాలను గౌరవించి రెండు సార్లు పెళ్లి కి రెడీ అయ్యారంటే అర్ధం చేసుకోవచ్చు వారిద్దరు ఒకరినొకరు ఎంత బాగా అర్ధం చేసుకున్నారో.