ఏమైనా కాంబినేషన్స్ కు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా సినిమా బిజినెస్ విషయంలో ఇవి చాలా కీలకం అయిపోతున్నాయి. నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ సవ్యసాచికి.. ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతోంది. మూవీ రిలీజ్ కి ఇంకా మూడు నెలల సమయం ఉన్నా.. ఇప్పటికే పలు ఏరియాల రైట్స్ విక్రయం అయిపోతున్నాయి.
రీసెంట్ గా ఓవర్సీస్ రైట్స్ డీల్ ను ఏకంగా 3.25 కోట్ల రూపాయలకు ఫైనలైజ్ చేసుకున్నారనే వార్తలు షాక్ ఇచ్చేవే. ఎందుకంటే.. ఇంతమొత్తం కలెక్ట్ చేయాలంటే.. చైతు సినిమా దాదాపు 1 మిలియన్ డాలర్ల వరకూ గ్రాస్ ను తేవాల్సి ఉంటుంది. చైతు గత సినిమాలు ఈ స్థాయిలో పెర్ఫామ్ చేసినది లేదు. అయినా సరే ఇంత రేట్ రావడానికి కారణం.. దర్శకుడు చందూ మొండేటి అని చెప్పచ్చు. ఓవర్సీస్ లో ఈ డైరెక్టర్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో ఇతను తీసిన కార్తికేయ.. ప్రేమమ్ చిత్రాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫామ్ చేశాయి. అందుకే బయ్యర్లు ఇంతగా నమ్మకం పెట్టేసుకున్నారు.
చైతు- చందూ కాంబినేషన్ లో వచ్చిన ప్రేమమ్.. మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు సవ్యసాచి కూడా ముందు నుంచి ఆసక్తి కలిగిస్తూనే ఉంది. కాన్సెప్ట్ రివీల్ చేయకుండా.. పోస్టర్లతోనే దర్శకుడు ఆకట్టుకుంటున్నాడు. అందుకే సవ్యసాచిపై ఇంత భారీ మొత్తం పెట్టారు యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు. అయితే రేటు బాగానే వచ్చినా.. చైతు.. చందూ మొండేటిలకు మాత్రం భారీ టార్గెట్ సెట్ అయింది.