వ్యక్తిగత జీవితం వేరు.. వృత్తిగత జీవితం వేరు! వ్యక్తిగత జీవితంలో కలతలతో వృత్తిగత జీవితాన్ని ముడి వేయకూడదు. ఇదే రూల్ ని ఫాలో అవుతున్నారు అక్కినేని నాగచైతన్య... సమంత. ఆ ఇద్దరూ ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇతరులను విమర్శించే కంటే స్వీయసమృద్ధిపైనే ఫోకస్ చేయడం ఆహ్లాదకరం. గత ఏడాది అక్టోబర్‌లో తన భార్య సమంత నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన నాగ చైతన్య తాజా కామెంట్ వేడి పెంచుతోంది. తన మాజీ భార్యతో తప్ప మరెవరితోనూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బెస్ట్ అని చెప్పకపోవడం షాకిచ్చింది.
తాజాగా ప్రముఖ వెబ్ పోర్టల్ తన ఉత్తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అడిగినప్పుడు `సమంత` అంటూ తడుముకోకుండా బదులిచ్చారు. ప్రస్తుతం తన హిందీ చిత్రం లాల్ సింగ్ చద్దా విడుదలకు సిద్ధమవుతుండగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చై పైవిధంగా స్పందించాడు. అమీర్- కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో చైతూ తెలుగు రాష్ట్రానికి చెందిన ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు. లాల్ సింగ్ చద్దాతో బాలీవుడ్ అరంగేట్రం ఘనంగా ఉంటుందని ఆశిస్తున్నాడు.
సమంత తో కెమిస్ట్రీ బెస్ట్ సరే.. ఇంకా ఏ హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇష్టం అని ప్రశ్నించగా.. బాలీవుడ్ నటీమణులలో అలియా భట్ .. దీపికా పదుకొణెతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతానని చై చెప్పాడు. ఆ ఇద్దరి నటనను ప్రేమిస్తాను. కాబట్టి నాకు ఎప్పుడైనా అవకాశం వస్తే వారితో ఏదో ఒక విధంగా స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడానికి నేను ఇష్టపడతాను అన్నాడు. చైతన్య- సమంత జంటగా మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించిన సంగతి తెలిసిందే. చైతన్య నటిస్తున్న థాంక్యూ త్వరలో విడుదల కానుంది. మనం ఫేం విక్రమ్.కె.కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.