యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఏడాది ఆరంభంలో బంగార్రాజుతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఫాదర్ నాగార్జునతో కలిసి అందుకున్న మరో సక్సెస్ ఇది. ఆ రకంగా ఏడాదిని గ్రాండ్ గానే లాంచ్ చేసాడు. కానీ అటుపై భారీ అంచనాల మధ్య రిలీజ్అ యిన సోలో చిత్రం 'థాంక్యూ' మాత్రం వాటిని అందుకోవడంలో విఫలమైంది. విక్రమ్.కె. కుమార్ మ్యాజిక్ చైతన్య విషయంలో వర్కౌట్ కాలేదు.
అటు పై బాలీవుడ్ డెబ్యూ మూవీ 'లాల్ సింగ్ చడ్డా' సైతం ఘోరమైన పరాజయాన్నే అందించింది. ఆ రకంగా హిందీలోనూ చైతన్య అంచనాలు తప్పాయి. ఈ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలని భావించాడు. కానీ పరాజయం అతన్ని మరోసారి వెనక్కి లాగిపెట్టింది. ఇలా ఎన్నో కారణాలు చైతన్య ని పరశురాంకి దూరం చేస్తున్నాయా? అంటే అవుననే కొత్త ప్రచారం తెరపైకి వస్తుంది.
పరశురాం తో చైతన్య ఇప్పటికే సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇంత వరకూ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. 'సర్కారు వారి పాట'కి ముందే అది ప్రారంభం కావాలి. కానీ అలా జరగలేదు. చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభను సీన్ లోకి తీసుకొచ్చి అతనితో సినిమా చేస్తున్నాడిప్పుడు. అలాగని పరశురాం ప్రాజెక్ట్ ఆగిపోయిందని కాదు. తాత్కాలికంగా అతన్ని పక్కనబెట్టినట్లు కనిపిస్తుంది.
పైగా 'సర్కారు వారి పాట' ఫలితం విషయంలో మరి అంత సౌండింగ్ వినిపించలేదు. ఇవన్నీ పరశురాంని అశ్రద్ద చేసేలా చేసాయని ఇప్పటికే కథనాలు వెలువడ్డాయి. కథలో కొన్ని రకాల మార్పులు కోరడం ఆయన చేయడం..చైతన్యన సంతృప్తి చెం దకపోవడం ఇలా కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తుంది. వీటన్నింటి నడుమ చైతన్య ఒత్తిడికి గురై కన్ ప్యూజన్ లోనూ పడుతున్నాడని గుస గుస వినిపిస్తుంది.
ప్రాజెక్ట్ డిలే అవుతుంది తప్ప ఏదో ఒకరోజు సినిమా సెట్స్ కి వెళ్లడం మాత్రం ఖాయంగానే కనిపిస్తుందని అభిమానుతు మాత్రం ధీమాగానే ఉన్నారు. వెంకట్ ప్రభు చిత్రం తర్వాత చై మొదలు పెట్టేది పరశురాం ప్రాజెక్ట్ అని అంటున్నారు.
ఇక చైతన్య కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి అదేదో బ్యాడ్ లక్ లా ఒక హిట్టు దక్కితే ఆ వెంటనే రెండు.. మూడు పరాజయాలు పలకరించడం పరిపాటిగానే మారింది. ఆకారణంగా చైతన్య మార్కెట్ ఒక పరిమితికి మించి పెరగడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.