యుద్ధం శరణం, సవ్యసాచి లాంటి ఫ్లాప్ లు నాగచైతన్యకు ఇబ్బందిగా మారాయా? అంటే ఆ ఛాన్సే లేదని తాజా సీన్ చెబుతోంది. వరుస ఫ్లాపులున్నా చై కెరీర్ కి మాత్రం ఏ డోఖా లేదు. ఇప్పటికిప్పుడు చైతూ లైనప్ చూస్తే షాక్ తినాల్సిందే. ఈ ఏప్రిల్ లో వైఫ్ సామ్ తో కలిసి నటిస్తున్న `మజిలీ` రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈలోగానే వరుసగా ప్రారంభోత్సవాలకు సన్నాహాలు చేస్తున్నాడు. వీటిలో తొలిగా మామ వెంకటేష్ తో కలిసి నటించే `వెంకీ మామ` మొదలు కానుంది. ఆ తర్వాత బిగ్ క్యూ ఉందని అక్కినేని కాంపౌండ్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
నాగచైతన్య ప్రస్తుతం వరుసగా స్క్రిప్టులు వింటున్నారు. వీటిలో క్రియేటివ్ గా అనిపించిన ఏ స్క్రిప్టును వదలడం లేదు. 2019-2020 సీజన్ లో అసలు క్షణం తీరిక అన్నదే దొరకడం కష్టం అని తాజా సన్నివేశం చెబుతోంది. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక యు.వి.క్రియేషన్స్ లో ఓ సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు సాగుతున్నాయి. అలాగే నాగార్జున స్నేహితుడు శివప్రసాద్ రెడ్డికి చెందిన కామాక్షి మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా ఉంటుంది. ఈ మూవీకి జాతీయ అవార్డ్ గ్రహీత ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దర్శకుడిని ఖరారు చేసి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇటీవలే అగ్రనిర్మాత దిల్ రాజు నాగచైతన్యతో ఓ సినిమా ఉంటుందని ప్రకటించారు. దీనికి సంబంధించి స్క్రిప్టు పనులు సాగుతున్నాయి. `జోష్` పరాజయానికి కసి తీర్చుకునే రేంజు స్క్రిప్టుతో రాజుగారితో చైతూ సినిమా ఉంటుందిట. అలాగే నాగార్జున హీరోగా రాజన్న వంటి హిస్టారికల్ మూవీని తెరకెక్కించిన దర్శకరచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చైతూకి కథ చెప్పారట. ఆ కథ ఫైనల్ అయ్యిందా.. లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక పలువురు అసిస్టెంట్ డైరెక్టర్లు నాగచైతన్యకు కథ చెప్పి ఒప్పించే పనిలో ఉన్నారు. అలాగే అక్కినేని అభిమాని ఒకరు ఇప్పటికే నాగార్జున, చైతూకి కథలు చెప్పే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.
ఇదిలా ఉంటే 2019 దసరాకి ఒకటి, 2020 సంక్రాంతికి ఒకటి అక్కినేని హీరోలు నటించే సినిమాల రిలీజ్ లు తప్పనిసరిగా ఉండాల్సిందేనన్న ప్లాన్ ఆ కాంపౌండ్ లో ఉందిట. చైతూ - వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న `వెంకీ మామ` ఈ ఏడాది దసరా బరిలో రిలీజ్ కానుందన్న సమాచారం ఉంది. అలాగే 2020 సంక్రాంతి బరిలో నాగార్జున `బంగార్రాజు` రిలీజ్ కానుంది. ఇందులో నాగచైతన్యకు ఓ రోల్ ఉంటుందని తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తుంటే చైతూ ఊపిరి సలపని ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడనే చెప్పాలి.