సమంత ‘గుడ్ బై’పై చైతన్య క్లారిటీ

Update: 2018-07-09 07:29 GMT
పెళ్లి అయిన తర్వాత కూడా సినిమా కెరీర్ కొనసాగిస్తున్న సమంత ఇటీవల వరుస విజయాలతో మళ్లీ ఫాంలోకి వచ్చింది. రంగస్థలం, అభిమన్యుడు సినిమాలతో  బంపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే రంగస్థలం మూవీ తర్వాత సమంత కొత్త సినిమాలపై సంతకాలు చేయడానికి అంతగా ఇష్టపడడం లేదు. ఇటీవల సమంత సినిమాల నుంచి నిష్క్రమిస్తోందని.. ఇంటికే పరిమితం అవుతోందని వార్తలొచ్చాయి.

అయితే ఈ వార్తలపై తాజాగా నాగచైతన్య స్పందించాడు. సమంత సినిమాలకు దూరం అవ్వడం లేదని.. కాకపోతే అప్పుడప్పుడూ కాస్త గ్యాప్ తీసుకోవచ్చని చెప్పాడు.. ‘ఈ మధ్య వచ్చిన వార్తల్లో నిజం లేదు. తను సినిమాల్లో నటిస్తుంది. కాకపోతే అప్పుడప్పుడు చిన్న పాటి బ్రేక్ తీసుకుంటుందేమో.. అంతకుమించి ఏం ఉండదు. తనకు సినిమాలంటే ఫ్యాషన్. ఈ రంగానికి దూరం కాదు’ అని చైతన్య తేల్చిచెప్పాడు.

ఈ వివరణ తర్వాత సమంత సినిమాలకు దూరం అవుతోందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. ఇక సమంత ఇప్పుడు కొత్త రోల్ తీసుకుంటోందట.. నాగచైతన్య వద్దకు వచ్చే కథలను సమంతనే డిసైడ్ చేస్తోందట.. ‘మా మధ్య కథల గురించి చర్చలు బాగానే నడుస్తున్నాయి. తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఈ పోస్టర్ నచ్చలేదు. ఈ కథ నచ్చలేదు అని మొహం మీద చెప్పేస్తోంది.. మా నాన్నలాగానే’ అని సమంత గురించి చెప్పుకొచ్చాడు చైతన్య.
Tags:    

Similar News