చైత‌న్య లుక్ కి కాంప్లిమెంట్ ఇవ్వ‌కుండా ఉండ‌లేం

Update: 2021-04-29 07:30 GMT
కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు నాగ‌చైత‌న్య‌. అత‌డు న‌టించిన ల‌వ్ స్టోరి రిలీజ్ కి రావాల్సి ఉండ‌గా వ‌ర‌స‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ అయ్యాడు. ప్ర‌స్తుతం మ‌నం ఫేం విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అత‌డు థాంక్యూ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే వ‌రుస‌గా ప‌లు చిత్రాల‌కు క‌మిట‌య్యాడ‌ని తెలిసింది.

ఇందులో యాక్ష‌న్ కింగ్ అర్జున్ తోనూ ఓ సినిమాకి ఓకే చెప్పార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇంద్ర‌గంటితో సినిమా త‌ర్వాత ఇది సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంద‌ట‌. అలాగే అర్జున్ ఒక యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ క‌థ‌ను వినిపించార‌న్న గుస‌గుసా వినిపిస్తోంది.

మ‌రోవైపు విక్ర‌మ్.కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో థాంక్యూ అనే విల‌క్ష‌ణ కాన్సెప్ట్ ఉన్న‌ చిత్రంలోనూ చైతూ న‌టిస్తున్నాడు. ఈ సినిమా క‌థాంశం స‌హా ప్ర‌తిదీ ఎగ్జ‌యిట్ చేసే విధంగా ఉంటుంద‌ట‌. చైత‌న్య పాత్ర ఎంతో వైవిధ్యంతో కెరీర్ బెస్ట్ గా ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌నం త‌ర్వాత వ‌రుస వైఫ‌ల్యాల‌తో ఉన్న విక్ర‌మ్.కె ఈసారి ఎట్టి ప‌రిస్థితిలో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డ‌మే ధ్యేయంగా ప‌ని చేస్తున్నారు. అఖిల్ తో హ‌లో.. నానీతో గ్యాంగ్ లీడ‌ర్ ఫెయిల‌య్యాక అత‌డు స్క్రిప్టు ప‌రంగా చాలా జాగ్ర‌త్త‌లే తీసుకున్నారు. ఈ సినిమాలో హరోయిన్ గా రాశీ ఖన్నా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.

మ‌రోవైపు నాగ‌చైత‌న్య ఈ మూవీ కోసం గెట‌ప్ కూడా మార్చాడు. అత‌డి స‌రికొత్త మేకోవ‌ర్ కి సంబంధించిన ఫోటో ని ఛాయాగ్రాహ‌కుడు పీసీ శ్రీ‌రామ్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. ఆ క్రాఫ్ తో పాటు అతడి గుబురు గ‌డ్డంతో లుక్ చాలా స్పెష‌ల్ గా ఉందంటూ కాంప్లిమెంట్స్ అందుకుంటున్నాడు.
Tags:    

Similar News