యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''లవ్ స్టోరీ''. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చైతూకి జోడీగా 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ఏసియన్ సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావ్ కలిసి నిర్మిస్తున్నారు. సున్నితమైన ప్రేమకథలని ఎంతో అందంగా ఆవిష్కరించే శేఖర్ కమ్ముల మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన 'లవ్ స్టోరీ' ప్రచార చిత్రాలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.
కాగా, ఇప్పటికే దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'లవ్ స్టోరీ'.. మిగతా చిత్రీకరణ ఈ షెడ్యూల్ లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో నాగచైతన్య మూవీ కూడా డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అందుకోసం ఇప్పటికే ప్రముఖ ఓటీటీలు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇస్తున్నాయని తెలుస్తోంది. చైతన్య మాత్రం ఓటీటీ రిలీజ్ కి ససేమిరా అంటూ థియేటర్స్ రీ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి థియేట్రికల్ రిలీజ్ కి వెళ్లాలని సూచిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అవుతుందా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ.. డిసెంబర్ లో కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.