టెన్త్ క్లాస్ చ‌దువుతున్న నాగ‌చైత‌న్య..బుగ్గ‌లు పాలుగారుతున్నాయిగా..!

Update: 2021-02-21 04:42 GMT
అక్కినేని వార‌సుడు నాగ చైత‌న్య వ‌య‌సు 30 సంవ‌త్స‌రాల పైనే. కానీ.. పై ఫొటో చూస్తే ఏమ‌నిపిస్తోంది..? ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న పిల్లాడిలాగానో.. లేదంటే.. ఇంట‌ర్ లో అడుగు పెడుతున్న అబ్బాయిలాగానో లేడూ..?! ఈ అద్భుత‌మైన మేకోవ‌ర్ ప్రస్తుతం నెటిజ‌న్ల‌ను విశేషంగా అల‌రిస్తోంది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ ఫొటో తెగ చెక్క‌ర్లు కొడుతోంది.

ఈ ఫొటో ద్వారా ఒక విష‌యం మాత్రం అర్థ‌మ‌వుతోంది. ఇటు ఫాద‌ర్ క్యారెక్ట‌ర్ కు, అదే స‌మ‌యంలో చిన్న‌వాడైన కొడుకు క్యారెక్ట‌ర్ కు చైతూ ప‌ర్పెక్ట్ గా మ్యాచ్ అవుతాడు. అలా ఏదైనా స‌బ్జెక్టు ప్లాన్ చేస్తే ప‌క్కాగా స‌రిపోయేలా ఉన్నాడు చైతూ. ఇంత‌కీ.. ఈ ఫొటో దేనికి సంబంధించిన‌ది అంటే.. నాగచైత‌న్య అప్ క‌మింగ్ మూవీకి సంబంధించిన‌ది.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ చిత్రానికి చెందిన పిక్ ఇది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లలో చైతూ చైల్డ్ క్యారెక్టర్ కు సంబంధించిన ఇమేజ్ ఇదట! రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ‘థాంక్యూ’ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లవ్ స్టోరీ’ ఈ మధ్యనే పూర్తయింది. ఆ తర్వాత థాంక్యూ సెట్లో అడుగు పెట్టాడు చైతూ. ప్రస్తుతం ఈ షూట్ శరవేగంగా కొనసాగుతోంది.
Tags:    

Similar News