అక్కినేని హీరో నాగచైతన్య నెక్స్ట్ థాంక్యూ సినిమాతో సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది మొదట్లో బంగార్రాజు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాగచైతన్య ఈసారి థాంక్యూ సినిమాతో మరింత డిఫరెంట్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. బంగార్రాజు సినిమా విజయంలో తండ్రి పాత్ర కూడా ఉంది కాబట్టి ఈసారి సోలోగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.
మనం సినిమా తరువాత విక్రమ్ కె.కుమార్ నాగచైతన్యతో సినిమా చేస్తూ ఉండడంతో మార్కెట్లో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందులోనూ దిల్ రాజు నిర్మాతగా ఉండడం ఈ సినిమా బిజినెస్ కు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనే చెప్పాలి. అయితే ఈ సినిమాకు మొన్నటి వరకు అయితే పెద్దగా హైప్ అయితే క్రియేట్ కాలేదు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయి చాలా రోజుల గడుస్తుంది. అయితే థాంక్యూ సినిమాను జూలై 8 న విడుదల చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ డోస్ పెంచాలని నిర్ణయించుకుంది.
ఇప్పటికే టీజర్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సినిమాలో నాగ చైతన్య విభిన్నమైన షేడ్స్ తో కనిపిస్తాడు అని పోస్టర్స్ ద్వారా అర్థమవుతోంది. ఒకవైపు మంచి లవర్ బాయ్ గా కనిపిస్తూనే మరొకవైపు మాస్ లుక్ తో కూడా ఆకట్టుకుంటాడు అని చిత్ర యూనిట్ పోస్టర్స్ ద్వారా తెలియజేస్తోంది. రీసెంట్ గా నాగచైతన్య కు సంబంధించిన ఒక పవర్ఫుల్ మాస్ లుక్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో నాగచైతన్య రగ్ డ్ లుక్కుతో ఆశ్చర్యపరిచాడు అనే చెప్పాలి.
విక్రమ్ కె.కుమార్ కూడా ఈ సినిమాలో మంచి లవ్ స్టొరీ తో పాటు ఒక థ్రిల్లింగ్ పాయింట్ ను కూడా హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. థాంక్యూ అనే టైటిల్ కూడా ఈ సినిమాకు కథకు తగ్గట్టుగానే పెట్టినట్లు చిత్రయూనిట్ తెలియజేసింది. ఇక ఈ సినిమా అనంతరం నాగచైతన్య విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో నే మరొక హారర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే వెంకట్ ప్రభు, పరశురామ్, బొమ్మరిల్లు భాస్కర్ వంటి దర్శకులతో కూడా సినిమాలో చేసేందుకు కమిట్మెంట్ తీసుకున్నాడు.