ప్రొడ్యూసర్లపై నాగ చైతన్య సీరియస్?

Update: 2016-08-10 10:35 GMT
ఇప్పటికే సెప్టెంబర్ 9న ''సాహసం శ్వాసగా సాగిపో'' ''ప్రేమమ్‌'' సినిమాలు రిలీజుకు రెడీగా ఉన్నాయని నిన్ననే వాటి నిర్మాతలు కన్ఫామ్‌ చేశారు. అయితే ఈ యవ్వారం అంతా కుర్ర హీరో చైతన్యకు కోపం తెప్పించిందా? అంటే అవుననే అంటున్నారు సన్నిహితులు. దానికి తోడు అతడు వేసిన ట్వీట్ ఒకటి తాను ఎంత ఫీలయ్యాడో చెప్పకనే చెబుతోంది.

''ఖచ్చితమైన డేట్లు ఏంటి అనేది నేను పోస్టు చేస్తాను. నేను చెప్పకపోతే.. అది నిజం కాదు'' అంటూ ట్వీట్ చేశాడు నాగచైతన్య. అంటే తాను చెబితనే అది నిజం లేకపోతే లేదు అని చెప్పడమేగా దానర్ధం. ఒక సినిమాకు జనాలు పరిగెత్తుకుంటూ వచ్చేది ఈ హీరోల ముఖం చూసే. అలాంటప్పుడు మనోడు ఇలా చెప్పడంలో తప్పేం లేదు. నిజానికి ప్రస్తుతం ''ప్రేమమ్'' సినిమా పోస్టు ప్రొడక్షన్ వర్కులో ఉండగా.. ఈ సినిమాను ఆగస్టు ఆఖరి వారం లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని చైతూ ఎప్పుడో ఫిక్సయ్యాడు. కాకపోతే ఇప్పుడు సడన్ గా గౌతమ్ మీనన్ కూడా డేటు ప్రకటించడం మనోడికి షాకిచ్చిందట.

వీళ్లందరూ చెబుతున్న రిలీజ్ డేటుకు ఇంకా నెల రోజులు టైమ్ ఉన్నా కూడా.. ఏ సినిమా ముందుగా వర్కును పూర్తి చేసుకుని రిలీజ్ అవుతుంది అనేది చెప్పడం కష్టమే. కాని ప్రేమమ్ సినిమా డేటును ముందుగానే ఫిక్సు చేశారు కాబట్టి.. అదే ముందు రావడం పద్దతి అంటున్నారు పెద్దలు. చూద్దాం ఏమవుతుందో.
Tags:    

Similar News