శైలజారెడ్డి వాయిదా పడిన వార్త తెలిసాక అక్కినేని ఫ్యాన్స్ బాగా డిస్టర్బ్ అయ్యారు. 31న ఖచ్చితంగా వస్తుందనుకున్నారు. మాస్ అల్లుడి అవతారంలో అత్తను ఆటపట్టించే పాత్రలో చైతుని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళ ఆశలకు చిన్న బ్రేక్ వేస్తూ తీసుకున్న నిర్ణయం వెనుక కారణం సహేతుకమైనదే అయినప్పటికీ కనీసం రెండు వారాల ముందు ఫైనల్ కాపీ ఉంచుకుంటే ఈ సమస్య తప్పేది కదా అనే కామెంట్ కి సమాధానం యూనిట్ మాత్రమే ఇవ్వగలేదు. జరిగిపోయిన దాన్ని ఎవరూ ఆపలేరు కాబట్టి కొత్త తేదీ కోసం వేచి చూడటం తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఇకపోతే శైలజారెడ్డి అల్లుడు సీన్స్ కొన్నింటిని రీ షూట్ చేస్తున్నారని కామెడీ డోస్ పెంచి ఇంకా ఎంటర్ టైన్మెంట్ ఉండేలా కొన్ని కీలకమైన మార్పులు ఉంటాయని కొత్త ప్రచారం మొదలైంది. సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారం వాయిదా పడ్డ తేదీ ఉంటుంది అనుకుంటున్న నేపధ్యంలో ఇలాంటి న్యూస్ ఖంగారు పుట్టించేవే.
దానికి తోడు గీత గోవిందం రిజల్ట్ చూసాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అందులో ఉండటంతో చైతు ఫాన్స్ అసలు ఏం జరుగుతోంది అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ వాయిదాకు కారణం కేరళలో వచ్చిన వరదల వల్ల సంగీత దర్శకుడు గోపి సుందర్ టైంకు రీ రికార్డింగ్ పూర్తి చేయలేకపోవడం అనేదే ప్రధానంగా వినిపించింది. మారుతీ కూడా అందుకే కేరళకు వెళ్లి అక్కడే ఇరుక్కున్నాడు. మరి ఇప్పుడు ఈ వార్తల ప్రకారం చూసుకుంటే రీ షూట్ చిన్నవే అయినా దానికి టైం కావాలి. ఆర్టిస్టులను తీసుకొచ్చి సెట్ చేయటం ఇప్పుడున్న డెడ్ లైన్ లో సులభమూ కాదు. కాబట్టి వీటిని నిజమని నమ్మడానికి లేదు. ఎలాగూ వాయిదా తప్పలేదు కాబట్టి ఇకనైనా క్లారిటీతో కొత్త డేట్ చెబితే బెటర్. రమ్యకృష్ణ అత్తగా ఈగో ఉన్న ఆవిడ కూతురిగా అను ఇమ్మానియేల్ నటించిన ఈ మూవీ చాలా కాలం తర్వాత తెలుగు తెరపై అత్తా అల్లుళ్ళ ఫార్ములాతో వస్తోంది.