ప్రస్తుత రోజుల్లో కొంత మంది యువ హీరోలు కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చి బాగానే సక్సెస్ అవుతున్నారు.సాధారణంగా హీరోలు ఒక కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారంటే అతను చాలా రోజుల నుంచి తెలిసైనా ఉండాలి లేకుంటే ఇతర నిర్మాతలు గాని బడా దర్శకులు గాని రిక్వెస్ట్ చేస్తే వారి మాటమీద ఒకే అంటారు. కానీ 90% హీరోలు కథ బావున్నా నవయువ దర్శకులతో పని చేయడానికి కొంచెం ఆలోచిస్తారు. ఎవరో ఒకరు ఎటువంటి అనుభవం లేకున్నా కథ బావుంటే ఒకే అనేస్తున్నారు.
అయితే కొత్త దర్శకులకు ఛాన్సులు ఇచ్చే వారిలో నాగ చైతన్య కూడా చేరిపోయాడు. "యుద్ధం శరణం" సినిమాతో రాబోతున్న చైతు.. ఆ సినిమాను తెరకెక్కించిన కృష్ణ మరిముత్తు కి దర్శకుడిగా మొదటి ఛాన్స్ ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చాడు. చైతన్య చెన్నై లో చదువుకుంటున్నపుడు కృష్ణ ఫ్రెండ్ అయ్యాడు. అయితే అతను కోలీవుడ్ లో గత అయిదు సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ చాలా కొన్ని ఇబ్బందులకు గురయ్యాడని చెబుతూ.. అతను సినిమా చెయ్యగలడనే నమ్మకంతోనే ఛాన్స్ ఇచ్చానని చెప్పాడు. అంతే కాకుండా కథ కూడా బాగా కనెక్ట్ అయ్యిందని క్యారెక్టర్ ను కొత్తగా ప్రజెంట్ చేయడం నాకు బాగా నచ్చిందని చై వివరించాడు.
ఇక కృష్ణ తో చేయడానికి మరో ముఖ్యమైన కారణం ఉందంటున్నాడు ఈ యువ హీరో. ఎప్పటికైనా ఒక స్నేహితుడితో సినిమా తియ్యాలని తన డ్రీమ్ అని చెబుతూ.. స్నేహితులతో ఓ సినిమా చేస్తే ఆ రిజల్ట్-ఔట్ ఫుట్ వేరేలా ఉంటుందని చెప్పాడు. ఇక ఈ సినిమాతో తన కోరిక తీరిందని కూడా చైతు వివరించాడు. మొత్తానికి చైతూ తన స్నేహితుడిపై నమ్మకం ఉంచి సినిమాను పూర్తి చేశాడు. మరి యుద్ధం శరణం సినిమా అతనికి ఎంతవరకు సక్సెస్ ని ఇస్తుందో చూడాలి.