అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ లోనే బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడని చెప్పచ్చు. సినిమా సినిమాకి సక్సెస్ రేంజ్ పెంచుకుంటూ.. ఏళ్లుగా ఊరిస్తున్న స్టార్ స్థాయికి చేరువ అవుతున్నాడు. నిజానికి ఈ స్టేటస్ ను పెద్దగా కేర్ చేసినట్లుగా కనిపించని చైతు.. యుద్ధం శరణం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
"టైటిల్ కి తగినట్లుగానే ఇది ఒక యాక్షన్ మూవీ. ఈ చిత్రంలో కాలేజ్ డ్రాపవుట్ గా కనిపిస్తాను. నేను ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో.. అత్యంత యూత్ మూవీ ఇదే. యంగ్ స్టర్స్ మెచ్చేలానే ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ చేశాం. రీవర్క్ చేశాం. యూత్ ని మెప్పించడం అనే టార్గెట్ తోనే ఈ సినిమా ఉంటుంది. మామయ్య వెంకటేష్ నాకు ఈ స్క్రిప్ట్ రికమెండ్ చేశారు. మరిన్ని ఒపీనియన్స్ తీసుకుని.. ఈ సబ్జెక్ట్ ని తెరకెక్కించాం" అని చెప్పిన నాగ చైతన్య.. స్టోరీ ఎంపికలో తండ్రి నాగార్జున సహాయం ఎప్పుడూ ఉంటుందని అన్నాడు. అయితే.. తను నటించిన గత కొన్ని సినిమాలు వరుసగా సక్సెస్ అవుతుండడంపై కూడా చైతు రియాక్ట్ అయ్యాడు.
"నాకు ఎలాంటి సబ్జెక్టులు సూట్ అవుతాయి.. ఏవీ సెట్ కావు అనే విషయం అర్ధమైంది. ఏ వ్యక్తికి అయినా అభివృద్ధి చెందాలంటే ఎదురుదెబ్బలు అవసరం. నేను వాటి నుంచి చాలా నేర్చుకున్నా" అని చెప్పిన నాగచైతన్య.. తన తర్వాతి చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకుంటానని చెప్పాడు. ఇప్పట్లో హిందీకి వెళ్లే ఉద్దేశ్యం లేకపోయినా.. బాహుబలి మూవీతో తెలుగు సినిమాకు అనేక ద్వారాలు తెరుచుకున్నాయని చెప్పాడు చైతు.