‘ప్రేమమ్’ కాపీ పేస్ట్ కాదన్నమాట

Update: 2016-10-01 17:30 GMT
ప్రేమమ్.. గత ఏడాది సౌత్ ఇండియా అంతటా ప్రకంపనలు సృష్టించిన సినిమా. ఈ చిత్రాన్ని మలయాళ ప్రేక్షకులే కాదు.. సౌత్‌లోని మిగతా ఇండస్ట్రీల ఆడియన్స్ కూడా ఆదరించారు. ‘ప్రేమమ్’ చూసి గొప్ప అనుభూతి పొందారు. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాల్ని రీమేక్ చేయడానికి మామూలుగా వేరే భాషల వాళ్లు సందేహిస్తారు. ఆ మ్యాజిక్ రీక్రియేట్ చేయడం అంత సులువు కాదు. కానీ నాగచైతన్య హీరోగా చందూ మొండేటి ఈ సాహసం చేశాడు. ఐతే మలయాళ వెర్షన్‌ ను తెలుగులోకి యాజిటీజ్‌ గా దించేయట్లేదట ‘ప్రేమమ్’ టీమ్. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశారట. ఆ మార్పులేంటో హీరో నాగచైతన్య మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

మలయాళంలో ఈ సినిమా చూడగానే ప్రేమలో పడిపోయాను. హీరో పాత్రకు బాగా కనెక్టయ్యాను. ఐతే ఆ సినిమాను తెలుగులో ఉన్నదున్నట్లుగా తీస్తే కష్టం. ఒరిజినల్‌ ‘ప్రేమమ్‌’ చాలా పొయెటిగ్గా ఉంటుంది. నిడివి కూడా ఎక్కువ. కామెడీ కూడా అక్కడి కల్చర్‌ కు తగ్గట్లుగా ఉంటుంది. వాళ్లు హీరోను బేకరీ యజమానిగా చూపించారు. ఇలాంటి అంశాలతో తెలుగు ప్రేక్షకులు అంతగా కనెక్టవలేరు. అందుకే మార్చాం. ‘ప్రేమమ్‌’లోని ప్రధాన అంశాన్ని తీసుకుని తెలుగుదనం జోడించాం. ఇక్కడి నేటివిటీ తగ్గట్లు సినిమా ఉంటుంది. చిత్రాన్ని మలుపు తిప్పే కీ పాయింట్‌ ను కూడా మరింత ఆసక్తికరంగా మార్చాం. సినిమాలో మూడు ప్రేమకథలుంటాయి. తొలి కథలో అనుపమ పరమేశ్వరన్.. రెండో కథలో శ్రుతి హాసన్ ఉంటారు. ఈ కథల్లో పెద్దగా మార్పులు కనిపించవు. ఐతే మడోన్నా సెబాస్టియన్ కనిపించే మూడో కథలో మాత్రం చాలా మార్పులుంటాయి’’ అని చైతూ చెప్పాడు.
Tags:    

Similar News