అక్కినేని ఫ్యామిలీ మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యువసామ్రాట్ నాగచైతన్య.. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకు తనని తాను మెరుగు పరుచుకుంటూ వచ్చిన చైతూ.. గత కొంతకాలంగా వరుస విజయాలతో ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ నాలుగు హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు ''థాంక్యూ'' చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.
నాగ చైతన్య మరియు రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'థ్యాంక్యూ'. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని ఈనెల 22న థియేటర్లలో విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతూ - రాశీ కలిసి సందడి చేశారు.
ఈ సందర్భంగా ఫస్ట్ లవ్ గుర్తుందా అని ఆర్జే హేమంత్ ప్రశ్నించగా.. ప్రతీ ఒక్కరికి ఫస్ట్ లవ్ ఫస్ట్ క్రష్ ఉంటుందని చైతూ బదులిచ్చారు. 'నా ఫస్ట్ లవ్ ఎనిమిదో తొమ్మిదో క్లాస్ లో ఉన్నప్పుడు జరిగింది. ముగ్గురం కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేసేవాళ్లం. అయితే ఆమె తమ హృదయాలను ముక్కలు చేసింది' అని చై నవ్వుతూ చెప్పారు.
అయితే ఆ తర్వాత ముగ్గురం మంచి స్నేహితులుగా మారిపోయామంటూ నాగచైతన్య తెలిపారు. ఫస్ట్ లవ్ గురించి చైతూ చెప్పిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే నాగచైతన్య సినీ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం అనుకోని సంఘటనలను ఎదుర్కివాల్సి వచ్చింది.
'ఏమాయ చేసావే' చిత్రంలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న సమంత రూత్ ప్రభును చైతూ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యమైన దాంపత్య జీవితం గడుపుతూ టాలీవుడ్ క్యూట్ కపుల్ అనిపించుకున్నారు. అయితే గతేడాది అక్టోబర్ లో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
చై సామ్ తమ నాలుగేళ్ళ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో పయనించనున్నట్లు పేర్కొంటూ ఓ నోట్ షేర్ చేశారు. వీరిద్దరూ విడిపోయి కొన్ని నెలలు కావొస్తున్నా ఇప్పటికీ ఇరువురికి సంబంధించిన ఏదొక విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారుతూనే ఉంది.
అయితే చైతూ మాత్రం విడాకుల ప్రకటన తర్వాత పూర్తిగా కెరీర్ మీదనే ఫోకస్ పెట్టాడు. వరుస సినిమాలు చేస్తూ దాన్నుంచి వీలైనంత త్వరగా బయటకు రావడానికి ట్రై చేస్తున్నాడు. 'థాంక్యూ' తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ బైలింగ్విల్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. అలానే విక్రమ్ కె కుమార్ తో 'దూత' అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇక 'లాల్ సింగ్ చద్దా' చిత్రంతో చై బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.